Actor Shivaji : హీరో శివాజి.. ఇప్పటోళ్లకి అంతగా తెలియకపోవచ్చు. ఒకప్పుడు హీరోగా కామెడీ చిత్రాలు చేశాడు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి సందడి చేస్తున్నాడు. సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన శివాజీ.. గత కొన్నేళ్ల నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. రాజకీయాలపై తనకు ఉన్న ఇంట్రెస్ట్‌తోనే సినిమాలను దూరం పెట్టాడని పలుమార్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. రాజకీయనాయకుడు కాకపోయినా.. రాజకీయాలపై ఉన్న ఆసక్తి.. తనను రాజకీయ విశ్లేషకుడిని చేసింది. చాలామంది సన్నిహితులు రాజకీయాలు మనకు ఎందుకులే అన్నా కూడా శివాజీ వినకుండా తనకు నచ్చిన దారిలోనే వెళ్తున్నాడు.
ఎవరు ఊహించని విధంగా శివాజీ.. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ రోజు నాగార్జునతో తన భార్య పేరు శ్వేత అని చెప్పిన శివాజీ.. హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే తాను సింగిల్ అని చెప్పాడు. అసలు ఎందుకలా చెప్పాడు అంటూ ప్రేక్షకుల్లో పలు సందేహాలు మొదలయ్యాయి. అయితే హీరో శివాజి ఒక ఇంటర్వ్యూలో తాను ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు. గుంటూరు జిల్లాలోని నర్సంపేటలో జన్మించిన శివాజి..తెలంగాణలోని నిజామాబాద్ కి చెందిన శ్వేత అనే ఒక అమ్మాయిని.. ఓ పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. ఈ ఇష్టం.. పెళ్లి వరకు దారితీసింది.మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అని ఒక ఇంటర్వ్యూలో శివాజీకి ప్రశ్న ఎదురవ్వగా.. ప్రేమ అని చెప్పలేనని, ఓ పెళ్లిలో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని అన్నాడు. అప్పటికే తాను యాక్టర్ అవ్వడంతో బయట తిరగడం కష్టంగా ఉండేదని, అందుకే అలా చేయకుండా నేరుగా పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.
ఇక తానకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని చెప్పాడు. వారు మాములు స్కూల్లోనే చదువుకుంటారని, సినిమా గురించి , షూటింగ్స్ గురించి పెద్దగా తెలియదని శివాజి అన్నాడు. శివాజి ఒకప్పుడు సీరియల్స్‌కు ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అదే సమయంలో సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేయడానికి శివాజీకి అవకాశం లభించింది. ఆ తర్వాత సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి. అలా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దాదాపు 90 కు పైగా సినిమాల్లో నటించాడు శివాజీ.