Actor Shivaji : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన అభిప్రాయాలు చెబుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి 164స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చంద్రబాబు , పవన్ కల్యాణ్‌కు పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, దేశవిదేశాలల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పలువురు సినీ, వివిధ రంగాల ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమల శ్రీవారిని నటుడు శివాజీ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో స్వర్ణ యుగం ప్రారంభం అయ్యిందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం త్వరగతిన పూర్తవ్వాలని శివాజీ ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వామి దగ్గర నాటకాలు ఆడితే ఎవరికైనా ఇలానే శిక్ష పడుతుందన్నారు. ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయి ఉన్నారు.గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.

ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే నేడు పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష సమావేశంలో ) పవన్ మాట్లాడుతూ.. మోదీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామని అన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు. ప్రధాని మోదీ సైతం పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌కు మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ పేరును ప్రత్యేకంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. మన సమక్షంలోనే పవన్ ఉన్నారు కాబట్టి పవన్ కల్యాణ్ అంటే ఒక సునామీ అని పేర్కొన్నారు. పవన్ అంటే పవనం కాదని.. సునామీ అని మోదీ పేర్కొన్నారు.