Actor Prudhvi Raj : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మనం చూశాం. గన్నవరంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌లు ప్రమాణం చేశారు. వారితో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు కూడా ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ రోజు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా ఈయనకు వివిధ రకాల శాఖల బాధ్యతలు కూడా అప్పగించారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ సెక్యూరిటీ కూడా పెంచారు. స్పెషల్ కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారు.డిప్యూటీ సీఎం పోస్ట్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను జనసేనాని పొందారు. ఇప్పటి వరకు విపక్షనేతగా పోరాడిన పవన్.. ఇకపై పాలకుడిగా తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నారు.అయితే ఈ రోజు జనసేన నేతలు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్‌ని కలిసి పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
జనసేనలోకి వచ్చిన పృథ్వీ కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయనని ఈ రోజు కలిసారు. పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. ఇక పవన్‌తో కలిసి పృథ్వీ ఫొటో దిగారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్‌ని చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. వారు సిద్ధం అంటూ ఓడిపోయారు. ఇప్పుడు పవన్ పేద ప్రజల పెన్నిథి. ఆయన పేద ప్రజలకి తప్పక సాయం చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి చాలా బాగుంటుంది.గాజు గ్లాసులో మజ్జిగ తాగాం, గంజి తాగాం. అభివృధ్ధి కోసమే పవన్ ని గెలిపించారు. డైమండ్ రాణి పవన్ ని విమర్శించింది. ఇప్పుడు ఆమె ఇంటి ముందే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని వస్తున్న పవన్ కళ్యాణ్ అని వాటిపైన రాసారు అంటూ పంచ్‌లు వేసారు పృథ్వీ.