టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తన నటనతో అశేష ప్రేక్షకాదరణ పొందారు. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించారు. అయితే గత ఏడాది వయోభారం కారణంగా కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది.గత ఏడాదిలో మహేష్ బాబు తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా కోల్పోవడంతో బాబు ఎంతో మనోవేదనకు గురయ్యారు. తండ్రి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల మహేష్ పెట్టిన పోస్ట్ కూడా అందరి హృదయాల్ని కదిలించింది.
తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ నవంబర్ 15వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ మృతితో యావత్ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో ముగినిపోయింది. కృష్ణ మృతి ఆయన కుటుంబ సభ్యులనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తీరని శోకం మిగిల్చింది. ఇప్పటికీ ఆయన లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. అయితే కృష్ణ హీరోగా నటించాడనే విషయం మాత్రమే మనకు తెలుసు. విలన్‌గా కూడా ఓ సినిమా చేశాడు.
హీరోగా ఉన్న కృష్ణ విలన్ గా నటించడానికి ప్రయివేటు మాస్టార్ అనే సినిమా కోసం ఒప్పుకున్నాడు. దిగ్గజాలు నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ప్రయివేటు మాస్టార్ సినిమాకి కె.విశ్వనాథ్ దర్శకత్వం అందించారు. ప్రయివేటు మాస్టార్ సినిమా ఫ్లాప్ అవ్వడం కృష్ణకి కలిసొచ్చింది. లేదంటే కృష్ణంరాజుల అటు హీరో కాకుండా ఇటు విలన్ కాకుండా మిగిలేవాడు. ఆ తరువాత గూడచారి 116 సినిమా కోసం కృష్ణని ఎంపిక చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో కృష్ణ తిరుగులేని హీరోగా మారిపోయి ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారో మనందరికి తెలిసిందే.