Acharya Movie : సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తు రాదు!? దర్శకత్వంలో, సంభాషణల్లో కొరటాల మార్క్ మిస్ అయింది. దీంతో ఆచార్య ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవిపై పడింది.
సినిమా బాక్సాఫీస్ పరాజయం ఒక విషయం కానీ దీంతో చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇక ఈ సినిమాకు థియేటర్ లలో ఫ్లాప్ టాక్ రావడంతో విడుదలైన కొద్దిరోజులకే ఓటీటీలోనూ, టెలివిజన్ లోనూ విడుదలైంది. అయితే సినిమా థియేటర్ లో వచ్చినప్పుడు ప్రేక్షకులు కేవలం సినిమా మాత్రమే చూశారు కానీ సినిమాలోని మిస్టేక్స్ ను గమనించలేదు. కానీ ఈ సినిమా ఓటీటీలో, టీవీలో చూసిన తర్వాత తప్పులను పట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో చిరంజీవి చేసిన ఓ భారీ మిస్టేక్ ను పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈ చిత్రంలో మెగాస్టార్ రథాన్ని తోసే ఓ సీన్ ఉంటుంది. సినిమాలో గట్టమ్మవారి ఆలయం ముందు నుండి కొందరు రథాన్ని లాగుతుంటే చిరంజీవి వెనక నుండి తోస్తారు. అయితే ఆ సీన్ లో మెగాస్టార్ కాళ్లకు షూ ధరించి ఉంటారు. నిజానికి ఆలయాల్లోకి వెళ్లేటప్పుడు దేవుడికి సంబంధించిన పనులను చేసేటప్పుడు భక్తులు చెప్పులను అస్సలు ధరించరు అన్న సంగతి తెలిసిందే. కానీ మెగాస్టార్ ఆలయాల గురించే సినిమా చేసి అలా ఎలా మిస్టేక్ చేసారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.