Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దశాబ్దన్నరం పైగా టాలీవుడ్లో తన హవా చూపించింది. స్టార్ హీరోయిన్గా రాణించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి, ఆ తర్వాత కుమారుడు నీల్ కిచ్లుకి జన్మనివ్వడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ తన అందం మాత్రం ఏమాత్ర తగ్గలేదని నిరూపిస్తుంది. కాజల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ పై ఫోకస్ పెట్టింది. భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కాజల్‌కి తాజాగా ఓ బిగ్ డైరెక్టర్ సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇస్తూ.. బరువు తగ్గించుకోమన్నాడట.
డెలివరీ తర్వాత బాడీలో చాలా మార్పులు వచ్చాయి. ఫేస్ అవుట్ అయింది. బుగ్గలు ఉబ్బిపోయాయి. వాటిని తగ్గించుకుంటే బాగుంటావు, లేకపోతే ఆంటీలా ఉంటావు అని ఇన్‌డైరెక్ట్ కామెంట్ చేశాడట. ఇది కాజల్ కు ఘోర అవమానం అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ స్టార్ డైరెక్టర్ కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ని పట్టుకొని అలా ఎలా అనగలడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ విషయం మాత్రం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాశంగా మారుతుంది.
కాజల్ ఇటీవల వరుసగా ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది. హాట్ ఫోటో షూట్లతో మైండ్ బ్లాక్ చేస్తుంది. రెట్టింపు గ్లామర్, హాట్నెస్తోపాటు ఫిట్నెస్ విషయంలోనూ తాను తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది. పెళ్ళైన రెండేళ్లలో ప్లానింగ్ చేసి పిల్లల్ని కన్నది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ మాతృత్వం గురించి గొప్పగా చెప్పింది.