Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆరోగ్యం

Papaya Seeds : పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే..?

editor by editor
September 17, 2023
in ఆరోగ్యం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Papaya Seeds : బొప్పాయి పండ్ల‌లో మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌నిచ్చే ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. వాటిలో మ‌న శ‌రీరానికి ప‌నికొచ్చే ఎన్నో కీల‌క పోష‌కాలు కూడా ఉంటాయి. అవి మ‌నకు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. శ‌రీర నిర్మాణానికి దోహ‌దం చేస్తాయి. అయితే కేవ‌లం బొప్పాయి పండు మాత్ర‌మే కాదు, దాని విత్త‌నాలు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌దు. నిజానికి బొప్పాయి పండ్ల‌ను తిన్నాక చాలా మంది విత్త‌నాల‌ను పారేస్తారు కానీ విత్త‌నాల‌ను కూడా తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే వాటిని తిన‌డం వ‌ల్ల‌ మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు స్పూన్ల బొప్పాయి విత్త‌నాల‌ను రోజూ తింటుంటే మ‌ధుమేహం, హార్ట్ ఎటాక్‌, క్యాన్స‌ర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కిడ్నీ, కాలేయ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. బొప్పాయి పండు విత్త‌నాల‌ను తింటే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం అంతర్గతంగా శుభ్రంగా తయారవుతుంది. పలు అవయవాల్లో ఉండే వ్యర్థాలు తొలగింపబడతాయి.

Papaya Seeds take them on empty stomach for many benefits
Papaya Seeds

శరీర బరువును త‌గ్గించ‌డంలో బొప్పాయి విత్త‌నాలు ఎంతో ప‌నిచేస్తాయి. బొప్పాయి విత్తనాల వల్ల జీర్ణాశయంలో ఉండే క్రిములు నాశనమవుతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ప్రధానంగా కడుపులో ఉండే పలు రకాల పురుగులు నశిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. శరీర మెటబాలిజం రేటును పెంచడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. బొప్పాయి విత్తనాలతో కండరాలు దృఢంగా మారుతాయి. నిత్యం మన తినే ప్రోటీన్లు సక్రమంగా వినియోగమవుతాయి. అందువల్ల కండరాల సమస్యలు పోవడమే కాదు, కండరాలు చక్కగా నిర్మాణమవుతాయి. నిత్యం పని ఒత్తిడి కారణంగా కలిగే అలసట తగ్గుతుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు.

బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావు. బొప్పాయి విత్తనాలు పురుషుల్లో వీర్య నాణ్యతను పెంచుతాయి. శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. ఎవరైనా బొప్పాయి విత్తనాలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. అయితే విత్తనాలను డైరెక్ట్‌గా తినలేమని అనుకునే వారు వాటిని పొడి చేసుకుని దాన్ని మజ్జిగ లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు. ఇలా తిన్నా పైన చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయి.

ఐదు లేదా 6 బొప్పాయి విత్తనాలను తీసుకుని వాటిని నలిపి ఏదైనా పండ్ల రసం లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే లివర్ శుభ్ర పడుతుంది. శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. బొప్పాయి విత్తనాలను తరచూ తింటుంటే కిడ్నీ సంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా బొప్పాయి విత్తనాలకు ఉన్నాయి. ఈ-కొలి వంటి బాక్టీరియాలను నిర్మూలించడంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

క్యాన్సర్ కణాలు, ట్యూమర్లు వృద్ధి చెందకుండా చూస్తాయి. పలు క్యాన్సర్లను అడ్డుకునే శక్తి బొప్పాయి విత్త‌నాల‌కు ఉంది. అప్పుడే సంతానం వద్దనుకునే వారికి ఇవి కాంట్రాసెప్టివ్ మాత్రల్లా ఉపయోగపడతాయి. వీటిని తింటుంటే మ‌హిళ‌లు అంత త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చ‌లేరు. ఇలా బొప్పాయి పండు విత్త‌నాలను తిన‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: Papaya Seeds
Previous Post

ఈ వారం ఓటీటీలో మూడు డిజాస్ట‌ర్ మూవీస్ విడుద‌ల‌.. ఇంకా ఏయే సినిమాలంటే..!

Next Post

Posani Krishnamurali : చంద్ర‌బాబు భార్య‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పోసాని

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

మొన్న ట్విట్ట‌ర్‌.. ఇప్పుడు ఫేస్‌బుక్‌.. భారీగా ఉద్యోగాల‌కు కోత‌.. ఏం జ‌రుగుతోంది..?

by Mounika Yandrapu
November 8, 2022

...

Read moreDetails
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

by Shreyan Ch
August 2, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.