Upasana : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారాలు పద్మ అవార్డులను ప్రకటించగా, ఇందలో భాగంగా తెలుగు రాష్ట్రాలకి చెందిన పలువురికి పద్మ పురస్కారాలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత అవార్డ్ పద్మ విభూషణ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంపై మెగా ఫ్యామిలీ పెద్ద కోడలు చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎంతో సంతోషంగా ఉన్నారు. మామగారికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. నిన్న చిరుకు సంబంధించిన అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
చిరంజీవి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోనుండడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. తాజాగా, మెగా కోడలు ఉపాసన ఆసక్తికర ట్వీట్ చేశారు. తమ కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ లు ఉన్నారని వెల్లడించారు. ఒకరు తన తాతయ్య డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, మరొకరు తన మామయ్య చిరంజీవి కొణిదెల అని వివరించారు. తమ కుటుంబానికి ఇంతటి విశిష్ట గౌరవం దక్కడాన్ని ఆశీర్వచనంలా భావిస్తున్నామని ఉపాసన పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి, ప్రతాప్ సి రెడ్డి కలిస్తున్న ఫొటోను కూడా ఆమె ఎక్స్ లో పంచుకున్నారు. ఐదుగురు మనవరాళ్లతో చిరు కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో చిరు ఒడిలో క్యూ్ట్ క్లింకార కూడా కనిపించింది. ఇక ఇప్పుడు మరో ఫోటో షేర్ చేస్తూ తమ కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణులు ఉన్నారంటూ సంబరపడిపోయారు.
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డికి కేంద్రం 1991లో పద్మ భూషణ్ ప్రకటించింది. 2010లో ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. చిరంజీవి 2006లో పద్మ భూషణ్ అందుకున్నారు. ఇప్పటికే చిరుకు పద్మ భూషణ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. 2006లో కేంద్రం ఆయనకు పద్మ భూషణ్ ప్రకటించింది. ఇక ఇప్పుడు పద్మ విభూషణ్ అందుకున్నారు చిరు. ప్రస్తుతం చిరు విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార సినిమా డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో త్రిష కథానాయికగా నటించనుందని టాక్.