Racha Ravi : ఇటీవల స్టార్ హీరోలకి బయట అభిమానులే కాక ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా ఎక్కువవుతున్నారు. పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ ఎలాంటి ప్రశంసల జల్లు కురిపిస్తుంటాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా బాలకృష్ణపై రచ్చరవి ఓ రేంజ్లో ప్రశంసల జల్లు కురిపించాడు. భగవంత్ కేసరి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రచ్చ రవి స్పీచ్ కి, బాలయ్య మీద చూపించిన ప్రేమకి.. బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఫిదా అయ్యారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న వరంగల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో రచ్చ రవి స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాకు రాజులు ఎలా ఉంటారో తెలీదు కానీ సినీ పరిశ్రమలో నేను చూసిన రాజు మాత్రం బాలయ్య బాబే. రాజు అంటే రాజ్యం ఉన్నోడో, బలగం ఉన్నోడో కాదు.. ధైర్యాన్ని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు. బాలయ్య ఉంటే ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ ధైర్యంగా ఉంటుంది. బాలయ్య మంచి మనసున్న వ్యక్తి. ఆయన నా రాముడు, నా చిన్ని కృష్ణుడు. మా అమ్మ బాలయ్యని ఇంటికి తీసుకురా తలకాయ కూర వండి పెడదాం అన్నది.
బాలయ్య బాబు మన ఇంటికి వస్తాడా అన్న. మా అమ్మ బాలయ్య కోసం తలకాయ కూర, బోటీ కూర అన్నీ వండుకొని వచ్చింది. అన్నకి దసరా దావత్ నాతోనే షురూ” అంటూ రచ్చ రవి తన తల్లిదండ్రులను బాలకృష్ణ దగ్గరకు తీసుకొని వెళ్ళి, బాలయ్య కోసం ప్రత్యేకంగా వండుకొని తెచ్చిన ఫుడ్ ని అందించాడు. ఆ సమయంలో బాలయ్య ఎంతో సంతోషంగా కనిపించాడు. ఇక స్టేజ్ మీద రవి ఎంతకూ మైక్ వదలకపోయే సరికి హరితేజ రంగంలోకి దిగింది. అయినా కూడా రవి మాత్రం మైక్ ఇవ్వలేదు. నీకు అసలు మైక్ ఇవ్వొద్దని అర్థమైందన్నట్టుగా కౌంటర్లు వేసింది. ఇక చివరకు అనిల్ రావిపూడి గురించి చెప్పాడు. రాజా ది గ్రేట్ నుంచి వరుసగా అవకాశాలు ఇస్తున్నాడని, తనకు సొంత అన్నలాంటివాడంటూ చెప్పుకొచ్చాడు. అలా చివరకు రచ్చ రవి తన మైక్ ఇచ్చేశాడు.