Nikhil : గత కొద్ది రోజులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ప్రేక్షకుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ టాక్‌తో దుమ్మురేపుతోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల కావడంతో తొలిరోజే సినిమాను చూసేయాలని థియేటర్లకు ఎగబడ్డారు. థియేటర్ల దగ్గర టపాసులు పేల్చి.. డ్యాన్సులు, డప్పు చప్పుళ్లతో హోరెత్తిస్తున్నారు. ప్రభాస్ కటౌట్‌కు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం నార్మల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రెటీలు కూడా సలార్ సినిమాను తొలిరోజే చూసి థ్రిల్ అవుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరోలు నిఖిల్, నవీన్ పోలిశెట్టి అయితే సినిమా చూసి రివ్యూలు కూడా పెట్టేశారు. బెనిఫిట్ షో చూశాక.. నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే సలార్ మూవీ చూశా. ఇది మామూలు విజయం కాదు మాన్స్టర్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ భాయ్ ని ఎప్పుడు స్క్రీన్ పై చూసినా గూస్ బంప్స్ వస్తాయి. హోంబాలే సంస్థకు కంగ్రాట్స్. ప్రశాంత్ నీల్ మనకి విజువల్ వండర్ ని ఇచ్చారు. తప్పకుండా చూడండి అని నిఖిల్ ట్వీట్ చేశారు. అలాగే యువ హీరో నవీన్ పోలిశెట్టి కూడా సలార్ మూవీపై తన స్పందన తెలిపాడు. సలార్ చిత్రం థియేటర్స్ లో ఎంతో జోష్ నింపుతోంది. సెలెబ్రేషన్స్ మామూలుగా లేవు. చాలా రోజుల నుంచి ప్రభాస్ అన్నని ఇలా చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదా బాక్సాఫీస్ బద్దలైపోద్ది అని. సలార్ టీం కి కంగ్రాట్స్ ని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు.
బెనిఫిట్ షో చూశాక థియేటర్ కి వచ్చిన శ్రీవిష్ణు అభిమానులతో కలిసి థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. తాను ఒక హీరో అని మర్చిపోయి, ప్రభాస్ అభిమానిగా థియేటర్ లో విజిల్స్ వేస్తూ ఫ్యాన్స్ తో కలిసి హంగామా చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోని రెబల్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోని ఇతర సెలబ్రిటీస్, దర్శకులు కూడా సినిమా చూసేందుకు థియేటర్స్ కి వచ్చి రచ్చ చేశారు. ప్రభాస్ నుంచి చాలా కాలం తరువాత ఒక మాస్ బొమ్మ రావడంతో రెబల్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.