Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Manchu Vishnu : క‌న్న‌ప్ప చిత్రంలో ప్ర‌భాస్ రోల్ గురించి హింట్ ఇచ్చిన మంచు విష్ణు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Shreyan Ch by Shreyan Ch
January 16, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Manchu Vishnu : మంచు మోహ‌న్ బాబు త‌న‌యుడు విష్ణు డైనమిక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అత‌ని డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ పై జనాల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది కన్నప్ప టీం. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించారు. మంచు విష్ణు వారసత్వంగా అవ్రామ్ మంచు, కన్నప్పతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టార్చ్ బేరర్, లెజెండరీ భారతీయ నటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు నుంచి మొదలుకొని ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తున్నట్టు అయింది.

ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మంచు వారబ్బాయి.. బడ్జెట్‌ గురించి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా రూపొందిస్తున్నారు. క్యాస్టింగ్‌తో మొదలుపెడితే గ్రాఫిక్స్‌ దాకా ఎక్కడా కంప్రమైజ్‌ కావడం లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భక్త కన్నప్ప గురించి మంచు విష్ణు కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పి.. రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చాడు. కన్నప్ప సినిమా విడుదల కోసం సౌత్‌లోనే కాదు నార్త్‌ ఆడియన్స్‌ కూడా అడుగుతున్నారని మంచు విష్ణు చెప్పాడు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 60 శాతం పూర్తయ్యిందని.. తొందరలోనే మిగతా పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తామని తెలిపాడు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.

Manchu Vishnu told about prabhas role in kannappa movie
Manchu Vishnu

త్వరలోనే కన్నప్ప గ్లింప్స్‌ విడుదల చేస్తామని మంచు వారబ్బాయి చెప్పాడు. అంతేకాదు ప్రభాస్‌ రోల్‌ గురించి కూడా చిన్న హింట్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని అన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చెబితే థ్రిల్‌ ఉండదని.. సమయం వచ్చినప్పుడు తానే వెల్లడిస్తానని అన్నాడు. మరో నెలలో న్యూజిలాండ్‌ వెళ్లాలని.. మిగిలిన షూటింగ్‌ కూడా అక్కడే కంప్లీట్‌ చేస్తామని చెప్పాడు. మంచు విష్ణు. చాన్నాళ్ల పాటు న్యూజిలాండ్ లో ఉన్న ఈ నటుడు, తాజాగా సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ వచ్చాడు. పండగ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన మంచు విష్ణు, కన్నప్ప షూటింగ్ వివరాలు బయటపెట్టాడు. కన్నప్ప షూటింగ్ 60శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా 40శాతం పెండింగ్ ఉంది. మిగిలిన భాగం షూటింగ్ కోసం వచ్చేనెలలో మరోసారి న్యూజిలాండ్ వెళ్లనుంది యూనిట్.

Tags: Manchu Vishnu
Previous Post

Pawan Kalyan : మెగా ఫ్యామిలీతో అకీరా, ఆద్య సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్.. తండ్రి లుక్‌లోనే ప‌వ‌న్ త‌న‌యుడు

Next Post

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

మొన్న ట్విట్ట‌ర్‌.. ఇప్పుడు ఫేస్‌బుక్‌.. భారీగా ఉద్యోగాల‌కు కోత‌.. ఏం జ‌రుగుతోంది..?

by Mounika Yandrapu
November 8, 2022

...

Read moreDetails
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

by Shreyan Ch
August 2, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.