Karthi : కార్తీ తదుపరి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా జపాన్ నవంబర్ 10న విడుదల కానుంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించగా, నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. దీపావళి కానుకగా విడుదలకానుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నానిపై తమిళ కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాని చాలా టాలంటెడ్ యాక్టర్ అని, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ ఎదిగిన నటుడన్నారు.
అది అంత సాధారణ విషయం కాదన్నారు. ఏ దర్శకుడు అయినా సరే..ఒక కొత్త స్క్రిప్ట్ ఉంది.. .. కానీ డిఫరెంట్‌గా ఉంది అంటే.. ఒక డోర్ ఉంది.. అది నాని ఇల్లు.. స్క్రిప్ట్ తీసుకొని అక్కడికి వెళ్లొచ్చు.. మీ కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని కొత్త టాలెంట్‌ను నాని ఎంకరేజ్ చేసే తీరును చెప్పుకొచ్చారు హీరో కార్తి. అంతేకాదు తనకు నానికి ఎన్నో పోలికలు ఉన్నాయి అని.. నానీ గురించి ఎంతసేపైనా మాట్లాడగలనని చెప్పుకొచ్చారు కార్తీ. ఇక నాని కూడా కార్తీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఈవెంట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈగ సమయంలో, చాలామంది నన్ను తమిళుడిగా భావించారు, అదే విధంగా, ఇక్కడి ప్రేక్షకులు కార్తీని తెలుగు నటుడిగా భావిస్తారు.
వారు అతనిని విపరీతంగా ప్రేమిస్తారు. కార్తీ గత ఏడాది మూడు హిట్లు సాధించి, ఆ సినిమాలన్నింటిలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ ఏడాది జపాన్ అనే మరో ప్రత్యేకమైన చిత్రంతో రాబోతున్నాడు. జపాన్ భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలా మొదలైంది సమయంలో కార్తీని కలిశాను. కార్తీ నాకు జెర్సీ కోసం శుభాకాంక్షలు తెలిపారు, అతను నాకు మంచి స్నేహితుడు. అను ఇమాన్యుయేల్ మజ్నుతో అరంగేట్రం చేసింది, మరియు ఆమెను ట్రైలర్‌లో చూసినందుకు నేను సంతోషంగా ఉన్నాను. నిర్మాత ప్రభుగారు మంచి అభిరుచి ఉన్నందున, ఆయన తన ట్రైలర్‌లను నాకు పంపుతూనే ఉన్నారు. అతను కాంబినేషన్లను నమ్మేవాడు కాదు. మంచి కథలను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఆయన పనిచేస్తున్నారు” అని అన్నారు. మధ్యలో తామిద్దరం బాలయ్య ఫ్యాన్స్ అన్నట్టుగా సైగ చేయడం విశేషం.