Sobhita Dhulipala : గత రెండు రోజులుగా శోభిత, నాగ చైతన్యల ఎంగేజ్‌మెంట్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. వీరిద్దరి వ్యవహారం మీద ఎప్పటి నుంచో రూమర్లు వస్తూనే ఉన్నాయి. సమంతతో విడిపోయిన తరువాత నాగ చైతన్య, శోభిత వ్యవహారం మీద రకరకాల రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ విదేశాల్లో కలిసి కనిపించేవారు. ఆ ఫోటోలు కూడా బాగానే వైరల్ అవుతూ ఉండేవి. కానీ వీరిద్దరూ ఎప్పుడూ ప్రత్యక్షంగా వీటిపై స్పందించింది లేదు.నాగ చైతన్య, శోభితల పేర్లు మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా, వాటిని వాళ్లు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. ఏదైతేనేం ఆగస్ట్ 8న నిశ్చితార్ధం జరుపుకుంది నాగ చైతన్య- శోభిత జంట.
నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా మరోసారి కొత్త కోడలి పరిచయం చేశాడు. ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకల్ని చాలా సీక్రెట్‌గా అతి కొద్ది మంది అతిథులతోనే నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుకలు జరిగాయి. తన నిశ్చితార్థం గురించి శోభిత వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.నా తల్లి నీకు ఏమై ఉండొచ్చు? నా తండ్రి నీకు ఏమైనా బంధువా? అసలు నువ్వు, నేను ఎలా కలుసుకున్నాం..? కానీ ప్రేమలో మన హృదయాలు తేలిపోతోన్నాయి.. విడిపోకుండా కలిసిపోయాయ్.. అంటూ ఇలా ఫేమస్ కొటేషన్లను షేర్ చేసింది.
అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత గురించి చాలా మంది సెర్చింగ్ మొదలు పెట్టారు. తాజాగా ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. శోభిత తెనాలిలో పుట్టగా ఆమె తండ్రి నేవీ ఆఫీసర్. తల్లి స్కూల్ టీచర్. మోడలింగ్ చేస్తూ.. బాలీవుడ్ లోకి అడుగు పెట్టి న ఈ భామకు ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు సమంత కాగా, కొద్ది రోజుల కిందట లవ్ మ్యారేజ్ చేసుకుంది. సమంతా ప్రేమ పెళ్లి సందర్భంగా తీసిన ఫొటోలో శోభిత కూడా కనిపించింది.. ఆ ఫొటోలని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకొని జీవితంలో సంతోషంగా ఉందామనుకున్న సమయంలో నాగ చైతన్య మాజీ భార్యని గుర్తు చేస్తున్నారేంట్రా అని అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.