Anasuya : యాంకర్‌గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు నటిగా తన సత్తా చాటుతుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షయని, విమానంలో సుమతి పాత్రతో మెప్పించిన యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ తాజాగా పెదకాపు చిత్రంలో మరో కీలక పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రతో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనసూయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెదకాపు కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. పెదకాపు సినిమాలో కులాలు గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ నేను కులాల గురించి పెద్దగా పట్టించుకోను. పెదకాపు అంటే ఊరికి పెద్దగా వ్యవహరించే వారు అని అనసూయ భరద్వాజ్ చెప్పారు.
నేను నా పెళ్లికి ముందు భర్తతో ఎనిమిదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నాను. బ్రహ్మణుడు నా పెళ్లి పత్రిక రాసే వరకు ఆయన బ్రహ్మణ కులానికి చెందిన వాడని నాకు తెలియదు. మా మధ్య కేవలం ఫుడ్, సినిమాలు, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకొనే వాళ్లం. ఆయన కులం గురించి అప్పటి వరకు తెలియదు. పెళ్లి సమయంలో కులం, గోత్రాల గురించి అడిగితే నాకు తెలియదు అని చెప్పారు అని అనసూయ చెప్పారు. సినిమాల్లో నేను చేసే నా క్యారెక్టర్ల గురించి నా పిల్లలు అడుగుతుంటారు. చెప్పాలనుకొంటే నేను చెబుతాను. లేదంటే మా ఆయనను చెప్పమంటాను. నేను కొన్ని విషయాలు దాచుకొకుండా నోటికి వచ్చినట్టు చెప్పేస్తాను. నాకు లౌక్యం తెలియదు. ఇప్పుడిప్పుడే ఏం మాట్లాడాలి. ఎంత మాట్లాడాలి. ఎలా మాట్లాడాలని అని నేర్చుకొంటున్నాను అని అనసూయ చెప్పారు.
పెద్ద కాపు చిత్రంలో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారనే నమ్మకం నాకు ఉంది అని అనసూయ అంది. అయితే అనసూయ చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి. కాని ఈవెంట్లో అనసూయ పొట్టి డ్రెస్‌లో కనిపించి నానా రచ్చ చేసింది. అంతేకాదు తన డ్రెస్‌లో అందాలు కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడింది అనసూయ. ఇది చూసిన నెటిజన్స్ అంత పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు, అంత ఇబ్బంది పడడం ఎందుకు అంటున్నారు.