Adivi Sesh : టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును అందిపుచ్చుకుంటారు. ఆ క్రమంలోనే విభిన్నమైన సినిమాలు చేస్తూ తమదైన మార్కును చూపిస్తున్నారు. అందులో టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ ఒకడు. హీరోగా పరిచయమైనప్పటి నుంచి డిఫరెంట్ మూవీస్ చేస్తోన్న అతను రీసెంట్‌గా ‘హిట్ ద సెకెండ్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
అయితే యంగ్ హీరోలలో మంచి విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ ఆదాయం ఏకంగా 450 మిలియన్ డాలర్లని కొందరు రాశారు.అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 3 వేల కోట్లకు పైమాటే అని అని చెప్పవచ్చు.ఈ ఏడాది అనగా 2022లో అడివి శేష్ ఆదాయం 450 మిలియన్ డాలర్లని , ఏడాదికి వచ్చే ఆదాయం రూ.359 కోట్లు అని, అడివి శేష్ ఒక సినిమాకి 5 కోట్లు ఛార్జ్ చేస్తారని, నెలకు 4 నుంచి 5 కోట్లు ఆదాయం వస్తుందని కథనంలో రాశారు. అయితే నెలకి 4 నుంచి 5 కోట్లు సంపాదించే అడివి శేష్ ఏడాదికి 3 కోట్లే సంపాదిస్తున్నారని రాయడం కామెడీగా అనిపించిది.
తాజాగా ఒక నెటిజన్ గూగుల్ లో తప్పుడు సమాచారం ఉంటుందని తెలుసు. అయినా ఆపుకోలేక అడివి శేష్ పారితోషికం ఎంత అని సెర్చ్ చేస్తే.. 450 మిలియన్ డాలర్స్ అని వచ్చింది. నరాలు కట్ అయిపోయాయి తెలుసా’ అంటూ ఒక నెటిజన్ అడివి శేష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దానికి అడివి శేష్ స్పందించారు. ‘మాకు కూడా ఆ 450 మిలియన్ డాలర్లు ఎక్కడుందో చెప్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం’ అంటూ సెటైరికల్ ట్వీట్ వేశారు. 2021లో రామ్ చరణ్ ఆదాయం 180 మిలియన్ డాలర్లు కాగా, భారతీయ కరెన్సీ ప్రకారం 1400 కోట్లు అని సమాచారం. ఇక మహేష్ బాబు ఆదాయం వచ్చేసరికి 134 కోట్లు అని సమాచారం. అంద ఆదాయం వారికి హీరోగాలుగా సినిమాలు చేయడంతో పాటు నిర్మాతగాను యాడ్స్ చేస్తున్నందుకు వస్తుంది. కాని ఓ మాదిరి పారితోషికం తీసుకునే అడివి శేష్ 3 వేల కోట్లు సంపాదించారంటేనే ఆశ్చర్యంగా ఉంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.