Basha Movie : గ్యాంగ్ స్టర్ సినిమాల ట్రెండ్ కు దక్షిణాదిలో బాషా అనే చిత్రం బీజం వేసింది. రజనీకాంత్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచి ఎన్నో సినిమాలకి స్పూర్తిగా ఇచ్చింది. ఈ సినిమా స్ఫూర్తితో ఆ తర్వాత కాలంలో ఎన్నో గ్యాంగ్‌స్టర్ సినిమాలొచ్చాయి. భాషా సినిమా తమిళంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలవడమే కాకుండా ఆ సమయంలో రజనీ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఈ సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు అప్పట్లో జరిగాయి.
తమిళ్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సురేష్ కృష్ణ కు తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతల్ని అప్పగిస్తూ చిరంజీవితో రీమేక్ చేసేందుకు ఓ అగ్ర నిర్మాత ప్రయత్నించారట. అయితే రజనీ స్థాయిలో బాషా క్యారెక్టర్‌ను మరో సారి రీక్రియేట్ చేయడం కష్టం కావడంతో ఈ రీమేక్‌లో నటించడానికి చిరంజీవి ఇంట్రెస్ట్ చూపలేదు.బాలకృష్ణ కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టు టాక్. అయితే పెద్ద హీరోలతో ఈ సినిమాని రీమేక్ చేసేందుకు గాను నిర్మాతలు దేవి శ్రీ థియేటర్‌లో చిత్రంకి సంబంధించిన స్పెషల్ షో వేసారట కూడా. అయితే ఎందుకో ఈ సినిమాని రీమేక్ చేసేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు.
దాంతో తమిళ్ వెర్షన్‌ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ‘బాషా’ స్టోరీకి ఫిదా అయిపోయిన చిరు ఆ స్టోరీనే తెలుగులో ‘బిస్ బాస్’ పేరుతో తెరకెక్కించాలని ముందుగా నిర్ణయించుకున్నారట. తెలుగు హక్కులు కొనుగోలు చేయాలని తన బావమరిది అల్లు అరవింద్‌కు చెప్పగా, రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ప్రొడ్యూసర్‌తో బేరానికి దిగారట. ఆ నిర్మాత తెలుగు రైట్స్ కోసం రూ.40లక్షలు డిమాండ్ చేయగా.. అరవింద్ రూ.25లక్షలకు అడిగారట. బేరం కుదరకపోవడంతో ఆ సినిమా తెలుగులో రీమేక్‌కు సాధ్యం కాలేదని కొందరు చెబుతుంటారు. 1995లో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ‘బాషా’ సినిమా సంచలన విజయం సాధించగా, ఈ చిత్రాన్ని తెలుగులో చిరు చేసి ఉంటే మరో రేంజ్
విజయం సాధించి ఉండేది.