Yashoda Movie : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సమంత నటిస్తున్న యశోద చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తుండగా.. హరి – హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే యశోద సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇక ఓపెనింగ్ ఏ మేరకు వస్తుందన్నది చూడాలి తప్ప అంచనా వేసేది కాదు.
ఇదిలా వుంటే సినిమాకు వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి 40 కోట్లు అయిందని నిర్మాత కృష్ణ ప్రసాద్ ఓపెన్ గా చెప్పినప్పటి నుంచి సమంత టీమ్ కిందా మీదా అయిపోతోంది. సినిమాకు గట్టిగా పాతిక కోట్లు కాలేదని, నిర్మాతకు ఏకంగా 10, 15 కోట్లు మిగిలిపోయాయని ప్రచారం చేస్తుంది. శాటిటైల్ ఇంత వచ్చింది.. హిందీ ఇంత.. ఓవర్ సీస్ అంత అంటూ తప్పుడు లెక్కలు చూపిస్తోంది. నిజానికి ఈ టీమ్ కు తెలియంది ఏమిటంటే కర్ణాటకలో అమ్మలేదు. హాట్ స్టార్ వాళ్లు విడుదల చేస్తున్నారు. హిందీ అమ్మలేదు యుఎఫ్ఓ వాళ్లు విడుదల చేస్తున్నారు. తమిళనాడు ఓన్ రిలీజ్.
కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 9 కోట్లకు విక్రయించారు. ఓవర్ సీస్ 1.50 కోట్లు కానీ సామ్ టీమ్ రెండున్నర కోట్లు అంటూ ప్రచారం చేస్తుంది. డిజిటల్ రైట్స్ 22 కోట్ల వరకు వచ్చింది. అంటే ఇప్పటికి రికవరీ అయింది. గట్టిగా 33 కోట్లు లేదు. కానీ సమంత టీమ్ మాత్రం 50 కోట్లు బిజినెస్ అయిందని చెబుతోంది. ఆ విధంగా నిర్మాత సేఫ్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నిజానికి నిర్మాత 8 కోట్ల లోటుతో సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే లాభాలు వుంటాయి. లేదంటే ఇంకా అంతే సంగతీ! చూడాలి రేపు యశోద మూవీ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో.