సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకుంటాననే నమ్మకం ఉందని శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది సామ్. నిరంతరం యాక్టివ్‌గా కనిపించే సామ్ ఈ విషయాన్ని బయటపెట్టడం, కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుందని ఎమోషనల్‌గా పోస్ట్ చేయడంతో సినీతారలు, అభిమానులు సైతం షాక్‌కి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, నాని, రాశీఖన్నా, జెనీలియా, హన్సిక, నందినీరెడ్డి, వంశీపైడిపల్లి సహా సమంతతో పని చేసిన చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలంటూ స్పందించారు.
సమంతకు ధైర్యం చెబుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ తో పాటు సుశాంత్ కూడా సమంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్స్ చేశారు. కానీ నాగార్జున, నాగ చైతన్య మాత్రం ఈ విషయంపై స్పందించ లేదు. దీంతో సోషల్ మీడియాలో వారి పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాజీ కోడలైనా.. తన అమ్మలాంటిది అని చెప్పుకొచ్చిన మాజీ మామగారు నాగార్జున, సమంతతో విడిపోయినా ఎప్పుడూ ఫ్రెండ్ లా కలిసుంటాను అని చెప్పిన మాజీ భర్త చైతన్య.
ఇలాంటి పరిస్థితిలో ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా పెట్టలేకపోతున్నారు అంటూ వారిని నిందిస్తున్నారు. ఆ మధ్య కాఫీ విత్ కరణ్ జోహార్ లో సమంత అక్కినేని ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ నాగార్జున ఇంకా మరిచిపోలేదని ఇండస్ట్రీలో టాక్. ఏదిఏమైనా సమంత మరియు అక్కినేని కుటుంబానికి సుదీర్ఘమైన స్నేహం పెళ్లికి ముందు నుంచే ఉంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. నాగార్జున, అమలతో కలిసి సమంతని పర్సనల్ గా కలవబోతున్నారట. ఇలాంటి పరిస్థితిలో ట్వీట్ వేసి ఊరుకోకూడదు అని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.