CM Revanth Reddy : తెలంగాణ మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లడుతూ.. ప్రభుత్వం ఖర్చులలో ఉంది. మా టిక్కెట్స్ కూడా మహేశ్వర్ రెడ్డి లాంటి శ్రీమంతులు కొనగలుగుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ ,వెంకటరమణ ఇద్దరు కూడా ఉన్నోళ్లే. రెడ్డి హాస్టల్ స్టూడెంట్స్. నాకు తెలిసినోళ్లే. పైల శంకర్ పేదోడు. మనం నడిపించుకోవాలి. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంతో నాకు మంచి అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం సంచలనంగా మారడం మనం చూశాం.. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఊహించని విజయాలను అందుకున్నారు. ఈ ఎన్నికల్లో సంచలనంగా మారిన కామెరెడ్డి నియోజకవర్గం ఎన్నికల్ల ఫలితాల్లో కూడా సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి విజయ దుందుభి మోగించారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిపి ఓడించి కొత్త చరిత్ర సృష్టించారు. వెంకటరమణా రెడ్డి గెలుపుతో బీజీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరిచూపు కామారెడ్డిపై పడింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు పట్టువిడవనని ప్రకటించాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పోటీచేస్తున్న నియోజకవర్గం నుంచి తాను కూడా నామినేషన్ దాఖలు చేసి కేసీఆర్ కు సవాల్ విసిరాడు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి బరిలోకి దిగారు. ఈ క్రమంలో కేసీఆర్, రేవంత్ ల మధ్యనే పోటీ ఉంటుందని భావించారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంకటరమణా రెడ్డి అనూహ్య విజయాన్ని అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ ను ఓడించి కామారెడ్డిలో కొత్త చరిత్ర లిఖించాడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి.