Mirzapur Season 3 : మీర్జాపూర్ ప్రపంచం ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్లు ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేశాయి. ఇప్పుడు మూడో సీజన్ వచ్చేసింది. మీర్జాపూర్ అంటే అందరికీ కొన్ని పాత్రలు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. గుడ్డూ భాయ్, కాలీన్ భాయ్, మున్నా, గోలు, మాధురి యాదవ్, శరద్ శుక్లా పేర్లు అందరికీ గుర్తుంటాయి. మూడో సీజన్‌లో మున్నా భాయ్ పాత్ర ఉండదు. రెండో పార్ట్ ఎండింగ్‌లోనే అంతం అవుతుంది. మున్నా భాయ్, కాలీన్ భాయ్‌ల మీద గుడ్డు అటాక్ చేయడంతో రెండో సీజన్ ముగుస్తుంది. ‘మీర్జాపూర్’ మొదటి రెండు సీజన్‌లను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లోని మూడో సీజన్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.
కొందరు కాలీన్ భయ్యా అంటూ పొగుడుతుంటే, మరికొందరు మున్నా భయ్యాను చాలా మిస్ అవుతున్నామంటున్నారు. మున్నా భయ్యా లేనందున చాలా మందికి ఈ సిరీస్ నచ్చడంలేదు. కాగా ‘మీర్జాపూర్ సీజన్ 2’ ముగింపులో మున్నా పాత్ర ముగిసిపోయింది. మూడవ సీజన్ ప్రారంభంలో కూడా మున్నా మరణించినట్లు చూపించారు. ఇదే అప్పుడు మీర్జాపూర్ అభిమానులను కలిచివేస్తోంది. మూడో సీజన్‌లో కాలీన్ భయ్యా కేవలం షోపీస్‌గా మారిపోయారని ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులు అంటున్నారు. కాగా మీర్జాపూర్ 3 నటీనటుల రెమ్యునరేషన్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. మీర్జాపూర్ సీజన్ 3కి గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి మొహంతీ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, పియూష్ పైన్యులీ, హర్షిత శేఖర్ గౌర్, రాజేశ్ తైలంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. మీర్జాపూర్ సింహాసనం కోసం ఈ మూడో సీజన్‍లోనూ పోరును మేకర్స్ చూపించారు.
మీర్జాపూర్ సీజన్ 3 ఎపిసోడ్ల నిడివి (రన్‍టైమ్) చూసి కొందరు మండిపడుతున్నారు. సీజన్ ఇంట్రెస్టింగ్‍గానే ఉన్నా సాగదీత వల్ల ఆసక్తి దెబ్బ తింటోందని, బోర్ ఫీలింగ్ వస్తోందంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీర్జాపూర్ మూడో సీజన్‍లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో సీజన్ సగటున సుమారు 50 నిమిషాల పాటు ఉంటుంది. దీంతో ఈ సీజన్ నిడివి ఎక్కువైందని థ్రిల్లింగ్‍గా, గ్రిప్పింగ్‍గా ఈ సీజన్ ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మూడో పార్ట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉన్నా సీజన్ మొత్తం ఉత్కంఠభరితంగా తెరకెక్కిచడంతో మేకర్స్ ఈసారి తడబడ్డారనే కామెంట్లు వస్తున్నాయి. మూడో సీజన్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.