Trisha : అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నాలుగు పదుల వయస్సులో కూడా తన అందంతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అదే బ్యూటీఫుల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది. సెకండ్ ఇన్సింగ్స్ లోనూ ఈ ముద్దుగుమ్మ జోరుగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. రీసెంట్ గా తమిళ బాహుబలిగా విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’తో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. కుందవై పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో త్రిష క్రేజ్ మరింతగా రైజ్ అయ్యింది. దాని తగ్గట్టుగానే వరుసగా సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం తమిళం మలయాళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది.మరోవైపు యాడ్స్‌తో కూడా బిజీగా ఉంది. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటీవల ఆర్టీ జ్యూయెల్లరీకి సంబంధించిన యాడ్ షూట్ లో త్రిష నటించింది. పట్టు వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించి రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. నిండు దుస్తుల్లో సౌత్ క్వీన్ వెలిగిపోయింది. వయస్సు పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని అందంతో త్రిష ఆకట్టుకుంది. అయితే త్రిష గతంలో రాజ్‌మహల్ సిల్క్స్ కోసం యాడ్ చేసింది. ఇందులో త్రిష చాలా యంగ్‌గా ఉంది. వివిధ రకాల చీరలలో త్రిష స్టన్నింగ్ లుక్‌లో కనిపించి వారెవ్వా అనిపించింది. త్రిష అప్పటి ఫోటోలు చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. ప్రస్తుతం త్రిష ఆస్తి విలువ కూడా అంతకంతకు పెరుగుతోంది. సినిమాకు దాదాపు 10 కోట్ల పైనే డిమాండ్ చేస్తుందట త్రిష. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు 90 నుంచి 100 కోట్ల వరకూ ఉంటుందని అంచన. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ.. చేతినిండా సంపాదిస్తోంది త్రిష. యాడ్స్ ద్వారా ఆమె ఏడాదికి 10 కోట్ల వరకూ సంపాదిస్తుందట.