Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Haris Rauf : సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌తో పాక్ పేస‌ర్ ర‌వూఫ్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌.. మండిప‌డుతున్న నెటిజ‌న్లు..

Shreyan Ch by Shreyan Ch
June 19, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Haris Rauf : ప్ర‌స్తుతం టీ 20 వ‌రల్డ్ క‌ప్ 2024 ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే ప్ర‌పంచ క‌ప్ లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు న‌డుచుకుంటున్న తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంటాయి. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ ప్ర‌యాణం ముగిసిన‌ప్ప‌టికి కూడా కొంద‌రు పాక్ ఆట‌గాళ్లు స్వ‌దేశానికి వెళ్ల‌కుండా ఇంకా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్తాన్ పేస‌ర్ హ్యారీస్ రౌఫ్ త‌న భార్య‌తో క‌లిసి అమెరికాలో షికార్లు కొడుతున్నాడు. అయితే.. అత‌డు ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ అమెరికాలో ఓ అభిమానితో గొడ‌వ‌ప‌డ్డాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ వైర‌ల్ గా మారింది. గత ప్ర‌పంచ క‌ప్ లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ వివాదం చెలరేగింది. యుఎస్ఏ, వారి చిరకాల ప్రత్యర్థి భార‌త్ చేతిలో షాకింగ్ ఓటముల తరువాత ఐర్లాండ్ పై ఓదార్పు విజయాన్ని మాత్రమే ఆ జట్టు సాధించగలిగింది. తాజాగా వైర‌ల్ అవుతున్న వీడియోలో హారీష్ రవూఫ్ అభిమానితో వాగ్వాదానికి దిగినట్లు వీడియో అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. తీవ్ర‌ ఆగ్రహానికి గురైన రవూఫ్ ‘యే ఇండియన్ హోగా’ అంటూ ఆ అభిమాని పై విరుచుకుప‌డ్డాడు. అయితే, తాను భార‌తీయుడు కాద‌నీ, ‘పాకిస్తానీ హు’ అని రిప్లై ఇచ్చాడు.

Haris Rauf behavior against a fan who asked him selfie
Haris Rauf

అయితే, రవూఫ్ ను శాంతింపజేసి ఉద్రిక్తతను తగ్గించేందుకు అతని భార్య ప్రయత్నించినప్పటికీ పరిస్థితి మ‌రింత ముదిరింది. అయినా స‌రే స‌ద‌రు అభిమాని, ర‌వుఫ్‌లు కాసేపు తిట్టుకున్నారు. అయితే.. గొడ‌వ‌కు అస‌లు కార‌ణం ఏంట‌నేది మాత్రం తెలియ‌లేదు. ‘అత‌డు క‌చ్చితంగా భార‌తీయుడే అయి ఉంటాడు’ అని ర‌వుఫ్ అనడం వీడియోలో రికార్డు అయింది. అయితే.. స‌ద‌రు అభిమాని ‘నేను పాకిస్థానీ’ అని బ‌దులిచ్చాడు. దాంతో, ర‌వుఫ్ కాస్త కూల్ అయ్యాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో దారుణ ఓట‌మిపై ఆ అభిమాని ర‌వుఫ్‌ను నిల‌దీసి ఉంటాడు. అందుక‌నే మ‌నోడు చిర్రుబుర్రులాడి ఉంటాడు అని అంద‌రు భావిస్తున్నారు. . ‘టీ20 వరల్డ్ క‌ప్ లో ఘోర‌ అవమానం ఎదుర్కొన్న తర్వాత పాక్ ఆటగాళ్లు పిచ్చివాళ్లయ్యారు’ అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. అలాగే, ‘ఐసీసీ దయచేసి హారిస్ లాంటి ఆటగాడిపై నిషేధం విధించండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Haris Rauf Fight
His wife tried to stop her.
Haris- Ye indian ho hoga
Guy- Pakistani hu @GaurangBhardwa1 pic.twitter.com/kGzvotDeiA

— Maghdhira (@bsushant__) June 18, 2024

Tags: Haris Rauf
Previous Post

Trivikram Srinivas : ప‌వ‌న్‌కు నిజంగా స్నేహితుడు అంటే త్రివిక్ర‌మే.. ఏం చేశారో తెలుసా..?

Next Post

Nithya Menen : ప్ర‌భాస్ విష‌యంలో త‌ప్పు చేశాన‌న్న నిత్యా మీన‌న్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
వార్త‌లు

Amani : రేయ్ అఖిల్‌.. అమ్మ‌ని రా.. గుర్తు ప‌ట్టావా.. అఖిల్ ఏమ‌న్నాడో చూడండి..!

by Shreyan Ch
February 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

by Mounika Yandrapu
October 30, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

by editor
October 1, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.