Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల కీర్తిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన దిగ్గజాలలో రామోజీరావు తప్పక ఉంటారు. నిర్మాత, ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా సత్తా చాటారు. ఇలా సుదీర్ఘ కాలంగా తనదైన రంగాల్లో సేవలు అందిస్తోన్న రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మరణించిన వెంటనే ఆయన పార్థీవదేహాన్ని హైదరాబాద్ నగర శివారులో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. అప్పటి నుంచి అక్కడ ప్రజల, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. దీంతో ఆయనను చివరి చూపు చూసుకునేందుకు సినిమా, రాజకీయ, వ్యాపార, పత్రికా రంగాల ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం వేల సంఖ్యలోనే హాజరయ్యారు.
మరణానంతరం తన అంత్యక్రియలు చేయడానికి రామోజీరావు ముందుగానే స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడే ఆయనకు అంతిమ సేవలు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రామోజీరావు పార్థీవదేహాన్ని నేటి ఉదయం 9 గంటల తర్వాత ఫిల్మ్ సిటీలో ఉన్న ఆయన నివాసం నుంచి స్మృతివనానికి తరలించారు. ఆ సమయంలో ఆయన భౌతికకాయాన్ని తరలించే వాహనంతో పాటు వందల సంఖ్యలో అభిమానులు వెంట వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రామోజీరావు పాడెను మోసి తన స్నేహభావాన్ని చాటుకున్నారు.
రామోజీరావుకి నివాళులు అర్పించేందుకు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.పవన్, త్రివిక్రమ్ కలిసి హాజరు కాగా, పూనమ్ కౌర్ కూడా హాజరై సందడి చేసింది. అయితే పూనమ్, పవన్ కళ్యాణ్ ఎదురెదురు పడడం హాట్ టాపిక్ అయింది.పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మీద పూనమ్ కౌర్ పరోక్షంగా ట్వీట్లు వేస్తూనే ఉంటుంది. గురుజీ అంటూ పూనమ్ కౌర్ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు పవన్ కళ్యాణ్‌ను కావాలనే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పేరు నేరుగా ఎప్పుడు ఎత్తుకోదు. కానీ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో చేసే ప్రసంగాల మీద పూనమ్ కౌర్ సెటైర్లు వేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు పవన్ ఎదురు పడగానే ఆమె సైలెంట్‌గా నిష్క్రమించడం హాట్ టాపిక్‌గా మారింది.