Venu Swamy : సమంత, నాగ చైతన్య విడాకుల విషయాన్ని ముందుగానే చెప్పి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు వేణు స్వామి. ఆయన గత కొంతకాలంగా తప్పుడు జాతకాలు చెబుతూ విమర్శల పాలవుతున్నారు. మొన్నామధ్య జరిగిన ఎన్నికలలో తెలంగాణ సీఎం కేసీఆర్ అవుతాడని ఆయన జోస్యం చెప్పగా, అది పూర్తిగా తప్పైంది.ఇక ఈ సారి జాతకం ప్రకారం వైఎస్ జగన్‌ది ఆరుద్ర నక్షత్రమని 2023 నుంచి అష్టమ శని ప్రారంభమై మరో రెండేళ్లుంటుందని, ఆయన సీఎం కావడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం అష్టమ శని మంచి స్థితిలో ఉన్నందున మరోసారి ముఖ్యమంత్రి యోగం వైఎస్ జగన్‌కు కచ్చితంగా ఉందన్నారు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం కాగా పవన్ కళ్యాణ్‌ది ఉత్తరాషాఢ నక్షత్రమన్నారు. పవన్, చంద్రబాబులకి సీఎం అయ్యే యోగ్యం కూడా లేదన్నారు.
మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024,2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి తెలిపారు. అయితే ఆ సమయంలో దీనిపై టీడీపీ సహా చాలా మంది నెటిజన్లు వేణు స్వామి తిడుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ) విజయకేతనం ఎగురవేయడంతో వేణు స్వామి కిందకి దిగి వచ్చారు. ప్రత్యేక వీడియో విడుదల చేసి ఇక జాతకాలు చెప్పనని అన్నారు. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నేను ఇచ్చిన ప్రెడిక్షన్‌లో నేను నరేంద్ర మోదీ గారి ప్రాభవం తగ్గుతుందని చెప్పాను. అలాగే ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పాను.
నాకున్నటువంటి విద్యను అనుసరించి నేను చెప్పాను. నేను చెప్పిన దాంట్లో సెంట్రల్‌లో మోదీ ఆధిపత్యం అనేది తగ్గింది అనేది ఒకటి జరిగింది. రెండోది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తారని నేను చెప్పిన ప్రెడిక్షన్ తప్పింది. జనరల్‌గా జాతకాన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ఇవి చెప్పాను. చాలా రోజుల నుంచి నన్ను విమర్శిస్తున్నవాళ్లు, ట్రోల్ చేస్తున్నవాళ్లు ఒక లక్ష్యంగా అది చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రెడిక్షన్ 100 శాతం తప్పు అయింది. దీన్ని ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను అని వేణు స్వామి అన్నారు. నేను చెప్పింది ఖచ్చితంగా వ్యతిరేకంగా జరిగింది.. వైసీపీ ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఆయనకి శుభాకాంక్షలు. నేను చెప్పింది తప్పయింది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు నుంచి రాజకీయ పరమైన విశ్లేషణలు కానీ ప్రెడిక్షన్స్ కానీ అలాగే సినిమా పరిశ్రమకి చెందిన విషయాలు కానీ ఎలాంటి ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తున్నాను. క్రికెట్, రాజకీయం, సినిమా కానీ ఇలా వ్యక్తిగత జాతకాలు విశ్లేషించను అంటూ వేణు స్వామి కామెంట్ చేశారు.
Venu Swami apologies for his wrong predictions #Electionresults pic.twitter.com/Umlw93ar09
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) June 4, 2024