Roja Vs Sudheer : ఏపీ సార్వత్రిక ఎన్నికలు ఎంత రంజుగా మారాయో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సారి పవన్ కళ్యాణ్ జగన్‌ని ఓడించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. బీజేపీ, టీడీపీతో జత కట్టిన ఆయన ఈ సారి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఇక పవన్‌ని గెలిపించేందుకు ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కోసం గెటప్ శీను, జానీ మాస్టర్, పృథ్వీరాజ్, వరుణ్ తేజ్,హైపర్ ఆది, నిర్మాతలు ఎస్కేఎన్, బన్నీ వాసు వంటి ప్రచారం చేస్తుండగా, తాజాగా సుడిగాలి సుధీర్ కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీపాద వల్లభ దేవస్థానాన్ని గెటప్ శీనుతో కలిసి సందర్శించిన సుడిగాలి సుధీర్ మీడియాతో కూడా మాట్లాడాడు.
ఈ సారి పవన్ కల్యాణ్ లక్ష మెజారిటీకి పైగా గెలుస్తారని అన్నాడు. మేము ఆర్టిస్ట్‌లుగా ఇక్కడికి రాలేదు. పవన్ అభిమానులుగా ఇక్కడికి వచ్చాం. మేము మొదటి నుండి చిరంజీవి, పవన్‌లకి పెద్ద అభిమానులం. ఆయన కోసం ప్రచారం చేసేందుకు ఇక్కడికి వచ్చాం అని సుధీర్ అన్నారు. పవన్‌కి ఈ సారి లక్షకి పైగా మెజారిటీ వస్తుందని అన్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్‌పై ఆయనకి తరపున ప్రచారం చేస్తున్న వారిపై రోజా విమర్శలు చేస్తూనే ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయడంపై మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. ఆ మేనిఫెస్టోలో విద్యారంగం కోసం పేర్కొన్న అంశాలను రోజా ప్రస్తావించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే జరిగేది ఇదే అంటూ వివరించారు.
ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు, ఐబీ సిలబస్ ఉండదు, పౌష్టికాహారం పెట్టే గోరుముద్ద ఉండదు, కార్పొరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ ఇవ్వరు, ఇంగ్లీషులో బాగా రాణించేందుకు బైలింగ్యువల్ బుక్స్ ఉండవు… అంటూ రోజా ఏకరవు పెట్టారు. అయితే ఇవన్నీ తాను చెప్పడంలేదని, టీడీపీ మేనిఫెస్టోనే చెబుతోందని పేర్కొన్నారు. అంటే, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద పిల్లల భవిష్యత్, వారి మంచి చదువులు… ప్రశ్నార్థకమే కదా… ఆలోచించండి అంటూ రోజా ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ సీట్ల విషయంలో కూడా రోజా పంచ్‌లు వేసారు. అక్కడ చెత్త ఇక్కడ చెత్త వేసుకొని పవన్ సీట్లు తీసుకున్నారు. ఈ సారి ఆయనకి డిపాజిట్ కూడా రావడం కష్టమే అని రోజా పేర్కొంది.