Pat Cummins : సన్ రైజర్స్ తరపున ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు తెలుగు వాళ్లని ఇంప్రెస్ చేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు ఆస్ట్రేలియన్ క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాల డైలాగులు చెప్పి దుమ్ములేపేసేవాడు. దానితో అతనికి బాగా అభిమానులు పెరిగారు. అతను ఇక అది అలవాటుగా మార్చుకొని ఏ పెద్ద తెలుగు సినిమా విడుదలైన, ఆ సినిమాలో నటుడిని, లేదా పాటని అనుకరించి రీల్స్ చేస్తూ నెటిజన్స్‌ని ఫుల్ ఎంటర్టైన్ చేసేవారు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చేసిన వ్యవహారశైలి ‘తగ్గేదే లే’ అనే దానిని అనుకరిస్తూ చేసిన వార్నర్ ఫుల్ గా ప్రశంసలు దక్కించుకున్నాడు.
డేవిడ్ వార్నర్ .. అల్లు అర్జున్ లాంటి వాళ్లనే కాదు మహేష్ బాబు లాంటి చాలామంది అగ్రనటులను సైతం అనుకరించాడు . ఇప్పుడు వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడుతున్నాడు, అయినా తెలుగు నటుల రీల్స్ చేస్తూనే వున్నాడు. ఇప్పుడు ఆయన బాటలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ చేరాడు. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ తెలుగు డైలాగ్స్ చెప్పి నెటిజన్లను అబ్బురపరిచాడు. “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను”, “కమ్మిన్స్ అంటే క్లాస్ అనుకున్నావా? మాస్ ఊరమాస్”, “SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ” అంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు పాట్ కమిన్స్. అంతే కాకుండా పవన్ కల్యాణ్ మేనరిజం చేసి అదరగొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఇక కమ్మిన్స్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ దుమ్ము లేపుతుంది. ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తోంది. గ్రూప్-స్టేజ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో విజయం సాధించిన ఈ జట్టు, ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు రికార్డు(ఆర్సీబీపై 287)ను కూడా ఇటీవలే సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఏకంగా మూడు సార్లు 250కి పైగా పరుగులు చేసింది. మొదటి మూడు మ్యాచ్‌లలో రెండింట్లో ఓడిపోయిన సన్‌రైజర్స్ పేలవంగా టోర్నీ మొదలుపెట్టి ఆ తర్వాత సంచలనాలు సృష్టించింది. ఓ ప్లేయర్‌గానే కాకుండా ఓ కెప్టెన్‌గానూ జట్టుకు ఎంతగానో సాయపడుతున్నాడు కమ్మిన్స్.
PAT CUMMINS SPEAKING TELUGU. 💥pic.twitter.com/kKqDqxBQS5
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024