Ex CBI JD Lakshmi Narayana : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై అన్ని పార్టీలు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, కీలక అధికారుల ఫోన్లు ట్యాప్ చేయించిందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ కీలక కామెంట్స్ చేశారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ కూడా ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, కీలక అధికారులు, మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు.
కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారని… రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు, సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. రెండో, మూడో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చునని స్వయంగా కేటీఆరే అంటున్నారని… దీనికి మూల కారకులు కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించి సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ఆ కుటుంబానికి ప్రమేయముందని అన్నారు.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కదలలేదని… సచివాలయానికి ఒక్కసారి కూడా వెళ్లలేదని ఆక్షేపించారు.
ఇక ఈ ట్యాపింగ్ వ్యవహారంపై జేడీ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంతా ఔట్ సైడ్ పోలీస్ పర్యవేక్షణలో జరగాలి. దేశ భద్రత కోసం చేయడం తప్పులేదు. కాని ప్రతిదానికి ప్రొసీజర్ ఉంటుంది. చట్టబద్దంగా చేయడం చాలా తప్పు. చట్టాలని రక్షించే వాళ్లే చట్టాలని ఉల్లంఘిస్తే ఎలా ఉంటుందని జేడీ అన్నారు. శాసన సభలో, పార్లమెంట్‌లో కూర్చున్న వాళ్లే ఉల్లంఘిస్తే ఎలా. పొలిటికల్ లీడర్ ఫోన్స్ ఎందుకు ట్యాప్ చేస్తున్నారు. అధికారం ఉంది కదా మీరు ట్యాప్ చేస్తే ఇప్పుడు మీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తారని జేడీ అన్నారు. సుప్రీంకొర్టు ఇచ్చిన ఆదేశాలని ఫాలో కాకుండా ఇలా చేస్తే తప్పు. కేసీఆర్‌కి రానున్న రోజులలో గడ్డు కాలమే అని జేడీ చెప్పుకొచ్చారు.