Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిహారిక కొణిదెల తన ఫ్యామిలీ వద్దన్నా కూడా సినిమా రంగంలోకి వచ్చి సందడి చేసింది. అయితే.. ఆమె చైతన్యను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి, విడాకుల తీసుకున్న తర్వాత వాటి గురించి తొలి సారి స్పందించారు. జీవితంలో పెళ్లి, విడాకులు అనేవి చిన్న విషయాలు కావని, అయినా ఆ సమయంలో తాను ఎలాంటి కఠిన పరిస్థితి ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసని, చూసేవారికి ఏం తెలుసని అన్నారు.
అలాంటి టఫ్ కండీషన్లో తనకు కుటుంబం విలువేంటో తెలిసొచ్చిందని కూడా నిహారిక పేర్కొన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు మాత్రమే మన కోసం నిలబడతారని తెలిపారు. విడాకుల సమయంలో తన తండ్రి నాగబాబు చాలా సపోర్ట్ చేశారని వెల్లడించారు. అయినా ఎవరూ కూడా పెళ్లి పెటాకులు అవుతుందని చేసుకోరని, కానీ, కొన్ని సార్లు అలా జరిగిపోతుందని అన్నారు. డివర్స్ అయింది కదా అని పెళ్లి చేసుకోకుండా ఉండను. ప్రేమని తప్పక నమ్ముతాను. అయితే మళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో నాకు కూడా తెలియదు అని నిహారిక చెప్పుకొచ్చింది.
తను నాన్న కూచి అని కూడా పేర్కొంది. తను కోరుకుంటే కొండ మీద కోతిని కూడా తీసుకొస్తారని పేర్కొంది నిహారిక. 2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్య తో నిహారిక వివాహం కాగా.. 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్యను నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో నిహారిక-చైతన్యల విహహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లైన ఏడాదికే వీళ్ల మధ్య మనస్పర్దలు రావడంతో.. విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. అయితే 2023 జూన్‌లో నిహారిక-చైతన్యలకు విడాకులు మంజూరు చేసింది కోర్టు.