Director Krish : కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు హాట్ టాపిక్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో బీజేపీ కీలక నేత యోగానంద్ తనయుడు, మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ కూడా పోలీసులకు పట్టిబడ్డారు. అయితే రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఫిల్మ్ డైరెక్టర్ క్రిష్ ఒక నిందితుడిగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. . తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల క్రితం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డైరెక్టర్ సోమవారం ఉపసంహరించుకున్నారు.
వాస్తవానికి కేసు నమోదైన వెంటనే జాగర్లమూడి క్రిష్ ముంబయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇలా తనను నిందితుడిగా పేర్కొన్న వెంటనే క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే అరెస్టు అవసరం లేకుండానే విచారణకు హాజరుకావాలని క్రిష్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మాదాపూర్ డీసీపీ వినీత్ ఎదుట హాజరయ్యారు. ఆయనని పలు విషయాలపై విచారించినట్టు సమాచారం. అయితే క్రిష్ పేరు వార్తలలో నిలవడంతో ఆయన పర్సనల్ విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
2008లో విడుదలైన గమ్యం చిత్రంతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన క్రిష్‌కు.. తొలి ప్రయత్నంలోనే మంచి పేరు వచ్చింది.వేదం, కంచె,గమ్యం ,గౌతమీపుత్ర శాతకర్ణి, కృష్ణం వందే జగద్గురుం వంటి డిఫరెంట్ స్టోరీస్ కి దర్శకత్వం వహించారు. అయితే ఈయన 2016లో రమ్య అనే డాక్టర్ ని వివాహం చేసుకొని ఆ తర్వాత రెండు సంవత్సరాలకే అంటే 2018లోనే విడాకులు తీసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే క్రిష్ డైవర్స్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.విడాకులకు కారణం ఓ హీరోయిన్ అంటూ అప్పట్లో ఓ మ్యాటర్ నెట్టింట చక్కర్లు కొట్టింది. కంచె సినిమా తీశాక ఆ సినిమా హీరోయిన్ తో డైరెక్టర్ క్రిష్ సన్నిహితంగా ఉండడంతో పాటు ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నారని,ఇక ఆ ఎఫైర్ కాస్త ఆయన భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారని టాక్.