Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన మహేష్ బాబు రీసెంట్‌గా గుంటూరు కారం అనే చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది. ఈ మూవీ డివైడ్ టాక్‌తో దాదాపు బాక్సాఫీస్ దగ్గర 90 శాతం రికవరీ సాధించింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.21.19 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఏది ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ఇక త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంతో మహేష్ క్రేజ్ పీక్స్‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక మహేష్ సినిమాలతోనే కాదు యాడ్స్‌తోను బాగానే సంపాదిస్తున్నారు. ఆయన ఇమేజ్‌ను బట్టి పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఏ హీరోకు లేనన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ మహేష్ బాబు చేతిలో ఉన్నాయి. ఫోన్ పేలో మొన్నటి వరకు అమితాబ్ బచ్చన్ వాయిస్ మాత్రమే దేశం మొత్తం వినిబడేది. తాజాగా తెలుగు ప్రజల కోసం ఫోన్ పే మహేష్ బాబు వాయిస్ యూజ్ చేసుకుంటోంది. రెండు సెకన్ల మహేష్ బాబు వాయిస్ కోసం దాదాపు రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ పండుగాడికి ఇచ్చినట్టు సమాచారం. ఈ యాడ్ ఎండార్సమెంట్ రెండేళ్ల పాటు ఉంటుందట.
మహేశ్ బాబు ఇటీవల ఫోన్ పే కోసం తన వాయిస్‌ను ఇచ్చారు. ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్‌లకు చేసిన డిజిటల్ చెల్లింపుల కోసం వాయిస్‌ని అందించిన మొదటి సౌత్ ఇండియన్ సెలబ్రిటీగా మహేష్ బాబు నిలిచారు. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు సూపర్ స్టార్లు నడుస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఫోన్ పే చెల్లింపుల కోసం తమ వాయిస్‌ను ఇస్తున్నట్లు సమాచారం. మమ్ముట్టి, కిచ్చా సుదీప్ కూడా దాదాపు అదే రేంజ్‌లో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మహేష్ బాబు వాయిస్‌తో ఫోన్ పే ఇపుడు ప్రజలకు మరింత చేరువ కానుంది.