YS Vijayamma : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి రాజస్థాన్‌లో వివాహం చేసుకోగా, రిసెప్షన్ శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, కేవీపీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వీరితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు షర్మిల తనయుడు రాజా రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ హాజరయ్యారు. అక్కడే ఉన్న విజయమ్మను కలిసారు. కుశల ప్రశ్నలు వేసారు. అక్కడే ఉన్న షర్మిల బంధువులతోనూ రఘురామ మాట్లాడారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. జగన్‌పై అవాకులు చవాకులు పేల్చిన రఘురామ ఇప్పుడు షర్మిళ కొడుకు రిసెప్షన్‌కి హాజరు కావడం ఆ రిసెప్షన్‌లో విజయమ్మ, షర్మిళతో ఆప్యాయంగా మాట్లాడడం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. . గత నెలలో హైదరాబాద్ లో జరిగిన రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయారు. స్వంత మేనల్లుడి పెళ్లికి కానీ, రిసెప్షన్ కి కానీ హాజరుకాలేదు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు ఫిబ్రవరి 17న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
జోధ్‌పూర్ లో జరిగిన వివాహానికి షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గైర్హాజరు కావడం తెలిసిందే. శనివారం (ఫిబ్రవరి 24న) రాత్రి శంషాబాద్‌లో జరిగిన షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్‌కు సైతం వైఎస్ జగన్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అంతకుముందు గత నెలలో హైదరాబాద్ లో జరిగిన రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయారు. ఇక హైదరాబాద్‌లో రిసెప్షన్‌కి తెలంగాణకి చెందిన అనేక మంది రాజకీయ నాయకులు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.