BJP : ఏపీలో పొత్తులు ఖాయమని చెబుతున్నా..అధికారికంగా ఖాయం కాలేదు. 2014 పొత్తులు రిపీట్ అవుతాయని పవన్ స్పష్టం చేసినప్పటికీ, ఇప్పటికీ దీనిపై బీజేపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు వైసీపీ పూర్తిగా ఎన్నికల కోసం గ్రౌండ్ లోకి వచ్చేసింది. అభ్యర్దులను దాదాపు ఖరారు చేసింది. ఈ రెండు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. పొత్తు ఖాయం చేయాలంటే బీజేపీ కొత్త డిమాండ్లు తీసుకొస్తోంది. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చల తరువాత ఇక పాత్తులు ఖాయమని భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంచనా వేసారు. ఈ నెల 7న చంద్రబాబు – అమిత్ షా భేటీ జరిగింది. 15 రోజులు అయింది. ఇప్పటి వరకు ఈ పొత్తు పైన అటు బీజేపీ, ఇటు టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కదలిక కనిపించటం లేదు. పవన్ మాత్రమే మూడు పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు.
బిజెపితో పొత్తు అంశంపై చంద్రబాబు అంత ఆశాజనకంగా మాట్లాడలేదు. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన పొత్తు ఖరారైందని, పవన్ కల్యాణ్ చెప్పినట్లు బిజెపి కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తామని, అంటున్నారు. టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం ఏపీలో జగన్ ను ఓడించాలంటే అవసరమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీని కోసం బీజేపీ ముఖ్యులతో మంతనాలు చేసారు. సీట్ల పంపకాల గురించే ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ 8-10 ఎంపీ స్థానాలు, 15-20 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తోంది.
టీడీపీ నుంచి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం చెప్పారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించటం లేదు. జనసేన కు 3 ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుండటంతో..బీజేపీకి ఇంతకు మించి అవకాశం లేదనేది టీడీపీ ముఖ్యుల వాదన. బీజేపీ మాత్రం తమ లక్ష్యం 400 ఎంపీ సీట్లుగా చెబుతూ..ఏపీలో తమకు 10 స్థానాలు కావాలని పట్టు బడుతోంది. 8 స్థానాల కంటే తాము తక్కువగా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు.. భాజాపాని పరీక్షంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే..మేము స్వేచ్చాజీవులం. పొత్తు అధిష్టానం చెబితే చేస్తామని ఏపీ బీజేపీ నాయకులు అంటున్నారు. అధిష్టానం కూడా ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వడం లేదు. అయితే బాబు లేకపోయిన మేము పోటికి వెళతాం అని బీజేపీ పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నట్టు అర్ధమవుతుంది.