Vijay Deverakonda : టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్‌గా విజయ్ దేవరకొండ రష్మిక జంటని చెప్పుకొస్తున్నారు.విజయ్ దేవరకొండ, చాలా తక్కువ కాలంలోనే దేశం అంతా పేరు మారుమోగి పోయేట్టు తన నటనతో మెప్పించాడు. ఈమధ్య విజయ్ దేవరకొండ వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. ముఖ్యంగా తన సహచర నటి రష్మిక మందన్నని వివాహం చేసుకోబోతున్నాడు అని తెగ ప్రచారం జరుగుతుంది, ఇంతకు ముందు కూడా చాలాసార్లు కొన్ని మీడియా వెబ్ సైట్స్ లో వైరల్ అయ్యాయి.రీసెంట్ గా ఓ నేషనల్ మీడియా విజయ్, రష్మిక.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ వార్తలు రాసుకొచ్చింది. ఇక ఈ న్యూస్ కాస్త బాగా వైరల్ అయ్యింది.
ఈ పుకార్లపై ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, విజయ్ దేవరకొండ ఈ పుకార్లకు ఒక చెక్ పెట్టేడు అని చెప్పాలి. తాను రష్మిక మందన్నను పెళ్లాడబోతున్నాడని సూచించే అన్ని పుకార్ల గురించి క్లియర్ చేశాడు. ‘‘ఈ రానున్న ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం గానీ పెళ్లి గానీ జరగడం లేదు. ఇలా ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని చాలా మీడియా వాళ్ళు భావిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇలాంటి పుకార్లు నేను ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాను. వాళ్లు నేను దొరికితే నన్ను పట్టుకొని పెళ్లి చెయ్యడానికి ఎదురు చూస్తున్నట్టున్నారు,” అని చెప్పాడు విజయ్.
![Vijay Deverakonda : రష్మికతో పెళ్లిపై విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టన్నింగ్ సమాధానానికి అందరు బిత్తరపోయారుగా..! Vijay Deverakonda comments on his marriage with rashmika mandanna](http://3.0.182.119/wp-content/uploads/2024/01/vijay-deverakonda.jpg)
ఈ సమాధానంతో అతను తన పెళ్లి గురించి వచ్చిన పుకార్ల గురించి మరోసారి స్పష్టంగా చెప్పేసాడు. ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉంటూ తమ పనిలో తాము ఉన్నామని, ఇప్పుడిప్పుడే పెళ్లి గురించిన ప్రస్తావన లేదని చెప్పేసాడు విజయ్ దేవరకొండ. కాగా ప్రస్తుతం వీరిద్దరూ తమతమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటిస్తున్నారు. గీతగోవిందం వంటి హిట్టుని అందించిన పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం సమ్మర్ కి పోస్టుపోన్ అయ్యింది. ఈ మూవీ తరువాత గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ VD13 చేయనున్నారు.