KTR Son Himanshu : కల్వకుంట్ల హిమాన్షు.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షురావు కల్వకుంట్ల రాజకీయాలలోకి రాకపోయిన అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనపై చాలా మంది విమర్శలు చేశారు. ఒకప్పుడు లావుగా ఉండే హిమాన్షు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. బాగా సన్నబడ్డారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు హిమాన్షురావు. అయితే పలు సందర్భాలలో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ దీక్షా దివాస్ సందర్భంగా.. తన తాతయ్యతో తనకున్న అనుబంధాన్ని.. జీవితంలో మరిచిపోలేని బాధపెట్టిన సమయాన్ని ఓసారి నెటిజన్లతో పంచుకున్నాడు.
తెలంగాణ కోసం తన తాతయ్య ఆమరణ నిరాహార దీక్షకు దిగినప్పుడు.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి పోతుందని.. తన కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పడం.. తన జీవితంలో మరిచిపోలేని బాధపెట్టిన సమయమని హిమాన్షు చెప్పుకొచ్చారు. తాను అప్పుడు 4 ఏండ్ల చిన్న వాన్నే కానీ.. తనను బాధకు గురిచేసిన నాటి సందర్భం, ఒక పీడకలగా తన మనసును చాలా కాలం వెంటాడిందని పేర్కొన్నారు. తనకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితున్ని పోగొట్టుకుంటానేమోనని భయమైందని పంచుకున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపొయాక కేసీఆర్‌తో పాటు ఆయన ఫ్యామిలీపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ టీడీపీ నాయకుడు ఏఎస్ రావు కేసీఆర్‌తో పాటు ఆయన మనవడు హిమాన్షుపై కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. వారి ఫ్యామిలీలో చిన్న వారి నుండి పెద్ద వారి వరకు కండకావరం పట్టిందని, మదం ఎక్కి ఎవరిని లెక్క చేయలేదని అన్నాడు. ఓ సారి వారి కుక్కలకి ఆపరేషన్ చేయదలచి వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళితే ఆపరేషన్ థియేటర్ నుండి అందరిని బయటకు పోమన్నాడు డాక్టర్. ఆ సమయంలో ఈ ఐరావతం గాడు డాక్టర్‌ని ఇష్టమోచ్చినట్టు తిట్టాడని చెప్పాడు. ఇక హోంగార్డ్‌లని అయితే దారుణంగా హింసించాడు. ఆయనని ఎత్తుకొని తిప్పమని, గోడ కుర్చీలు వేసి టార్చర్ పెట్టేవాడని ఏఎస్ రావు స్పష్టం చేశారు.