Roja : ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం చాలా వాడివేడిగా సాగుతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ పక్కా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ ఇప్పటికే కొంత మంది నాయకులతో రెండు జాబితాలని విడుదల చేసింది. మూడో జాబితాలో ఎవరిని చేర్చుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. . మొత్తంగా 30 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే పలువురు మంత్రులు సీట్లు కోల్పోతున్నారనే ప్రచారం సాగుతోంది. మంత్రులు రోజా, అంబటికి సీట్లు కష్టమే వాదన మొదలైంది. ఈ సమయంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మంత్రి రోజా 2014, 2019లో వరుసగా రెండు సార్లు నగరి నుంచి గెలుపొందారు. ఈ సారి నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే వస్తున్న అసమ్మతి కారణంగా సీటు ఇవ్వరనే అభిప్రాయం వినిపించింది. అయితే, తన సీటు విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఆమోదమేనని రోజా వెల్లడించారు. ఇప్పుడు నగరిలో రోజానే పోటీ చేస్తారని పార్టీ ముఖ్యుల నుంచి సమాచారం అందుతోంది. అదే విధంగా సత్తెనపల్లి లో అంబటి రాంబాబును మార్చి ఇతరులకు సీటు ఇస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే నియోజకవర్గానికి చెందిన కొందరు తాడేపల్లికి వచ్చి తమకు సీటు ఇవ్వాలని కోరారు. కానీ.. సత్తెనపల్లి నుంచి మరోసారి అంబటినే బరిలోకి దిగుతారని పార్టీ నాయకత్వం క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
రోజాపై సస్పెన్షన్ తప్పదనే టాక్ వినిపిస్తున్నా కూడా ఆమె మాత్రం టీడీపీ-జనసేనపై నిప్పులు చెరుగుతూనే ఉంది. రాష్ట్రానికి పట్టిన టీడీపీ-జనసేన అనే పీడను శాశ్వతంగా తొలగించడానికి జనం సిద్ధంగా ఉన్నారని రోజా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి పట్టం కట్టడం కోసం జనం ఎదురు చూస్తోన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన పరిపాలనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే వైఎస్ జగన్.. అన్ని రకాల హామీలను నెరవేర్చుతూ వస్తోన్నారని, ఈ అయిదు సంవత్సరాల కాలంలో మేనిఫెస్టోను పక్కాగా అమలు చేశారని రోజా గుర్తు చేశారు.