Feroz Khan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన పరిపాలన సజావుగా సాగుతుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కేబినేట్‌లో 17 మంది మంత్రులుగా ఉండగా, ఇంక ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అవి ఎవరికి దక్కుతాయనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పదకొండు స్థానాలకి పదువులు ఇవ్వగా, మిగతా ఆరు స్థానాలు ఎవరికి ఇస్తారనే ఆసక్తి కూడా నెలకొని ఉంది. ఫిరోజ్ ఖాన్‌కి కూడా ఏదో పదవి ఇస్తారంటూ ప్రచారం నడుస్తుంది.
ఫిరోజ్ ఖాన్ వాస్తవానికి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్.. ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ చేతిలో 2037 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైదరాబాద్ పాతబస్తీలో పరిధిలో కాంగ్రెస్ యంగ్ లీడర్ గా పేరు పొందిన ఫిరోజ్ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ సూచించారని తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయన హేతుబద్దమైన కారణాలను ఎత్తి చూపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ ల పరిధిలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
దీంతో ఫిరోజ్ ఖాన్ కు మంత్రి పదవి ఇస్తే ఈ రెండు జిల్లాలతో పాటు ముఖ్యంగా పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉంది. అనేక సమస్యలపై పోరాడే ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని మైనారిటీ వర్గంలో పార్టీ ప్రతిష్టను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఇటీవల ఫిరోజ్ ఖాన్ తనకి ఏ పదవి దక్కుతుందనే దానిపై స్పందిస్తూ.. నాకు పదవి ఇచ్చిన పని చేస్తా, ఇవ్వకపోయిన పని చేస్తాను. కాకపోతే హై కమండ్‌ని ఒక్క కోరిక అడుగుతా.. ఎంపీ సీటు ఇస్తే వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసి ఓడిస్తానని చెప్పుకొచ్చాడు.