Nymisha Reddy : ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కూడా ఆలయాలకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా తన భర్త కుటుం సభ్యులతో కలిసి కూకట్ పల్లి ఆలయానికి వెళ్లింది. సామాన్యురాలి మాదిరిగా లైన్‌లో నిలుచొని దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎలాంటి హంగు అర్భాటాలు లేకుండా నైమిషా ఇలా దర్శనం చేసుకోవడంపై ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులే కాదు దశాబ్ద కాలంగా కేసీఆర్ పాలనతో విసిగిపోయిన విభిన్న వర్గాల వారు కూడా సంతోషం వ్యక్తం చేసారు, రేవంత్ కూతురు అయితే తన తండ్రి గెలిచినప్పుడు చాలా ఆనందించింది.రేవంత్ రెడ్డి కూతురి పేరు నైమిషా రెడ్డి. ఆయనకు ఆమె ఒక్కతే సంతానం. చిన్నప్పటినుంచి కూతురంటే ఎంతో గారాబం. రేవంత్ రెడ్డి మిగతా రాజకీయనాయకుల్లా కాదు. కుటుంబానికి ప్రత్యేక సమయం కేటాయిస్తారు.ఎంత బిజీగా ఉన్నా.. భార్య గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డిలే తన లోకం. వారితో సినిమాలకు, డిన్నర్ లకు వెడుతుంటారు. వారికి ఇవ్వాల్సిన క్వాలిటీ సమయం ఇస్తారు. ఏ విషయం అయినా ముగ్గురూ చర్చించుకుంటారు. వాదోపవాదులు సరదగాగా నడుస్తాయట.
కూతురు అంటే రేవంత్‌కి వల్లమాలిన ప్రేమ. దీనికి కారణం తనది ప్రేమ వివాహం కావడం. తమ ప్రేమకు ప్రతిరూపంగా ఆ అమ్మాయి కావడం కూడా. అందుకే బిడ్డ పెళ్లి సమయంలో తాను చర్లపల్లి జైల్లో ఉండడాన్ని రేవంత్ తట్టుకోలేకపోయాడు. ఎంగేజ్మెంట్కు జైలునుంచి నేరుగా రావడం.. బంధువులతో మాట్లాడే అవకాశం లేని నిబంధనలతో బాగా ఇబ్బంది పడ్డారు. తన ఇంట్లో చేసుకునే మొదటి వేడుకకు తానిలా అయిపోయానని ఆ సమయంలో కంటతడి కూడా పెట్టారు. కూతురు నైమిషకు కూడా తండ్రి అంటే ప్రాణం. తన తండ్రే తన హీరో అని చెబుతుంది.