Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ‘యువగళం నవశకం’ విజయవంతంగా ముగిసింది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరిగిన ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తోపాటు ఇరు పార్టీలకు చెందిన నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే అన్నారు.
నవశకం.. యుద్ధం మొదలైందని.. తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు యుద్ధం ఆగదన్నారు. విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగిన యువగళం నవశకం సభలో మాట్లాడిన లోకేష్.. పాదయాత్రలో ప్రజల సమస్యల్ని తెలుసుకునే అద్భుత అవకాశం దక్కిందన్నారు. అడుగడునా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరిగిందని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకుసాగామన్నారు.చంద్రబాబును చూస్తే జగన్ భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు.చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మొదట నాకు కాల్ చేసి అండగా నిలిచింది పవనన్న. గుండెల్లో ఎంత బాధ ఉన్నా నువ్వు ప్రజల కోసం పోరాడు అని ప్రజల్లోకి పంపింది మా అమ్మ భువనమ్మ అని లోకేష్ అన్నారు.
అయితే యువగళం ముగింపు సభ తర్వాత సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే పాట ప్లే చేయగా, ఆ పాటకి జనసైనికులు, టీడీపీ నాయకులు తెగ డ్యాన్స్‌లు చేశారు. వారి డ్యాన్స్ చూసి ప్రతి ఒక్కరు షాకయ్యారు.పవన్ కళ్యాణ్ కూడా ఆ రెస్పాన్స్ చూసి సంతోషించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక ఇదిలా ఉంటే త్వరలో అమరావతి, తిరుపతిలో పవన్‌తో కలిసి సభలు నిర్వహిస్తాం అని చంద్రబాబు అన్నారు. ఆయా సభల్లో టీడీపీ-జనసేన ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.