Ayyannapatrudu : ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పేరుతో పలు ప్రాంతాలు చుట్టేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ పాదయాత్రలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా . బీసీ, ఎస్సీలకు జగన్ మాయ మాటలు చెప్పాడని, బీసీ కార్పొరేషన్లు జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు 10 శాతం తగ్గించిన దుర్మార్గుడు జగన్ అని, బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది జగన్ ఆరోపించారు. పాయకరావుపేట నియోజకవర్గo పెనుగొల్లులో బీసీ సంఘాల నేతలతో టీడీపీ యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు.
బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతోపాటు వారి ఆర్థిక అభ్యున్న తికి కృషిచేసింది ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి కీలక పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని అమలు చేస్తే…దానిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బీసీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బీసీలకు తమ హయాంలో కల్పించిన రిజర్వేషన్లలో పది శాతం మేర జగన్ తగ్గించారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తగ్గించిన 10 శాతం రిజర్వేషన్‌ను టీడీపీ అధికారంలోకి రాగానే పెంచుతామని హామీ ఇచ్చారు.
ఇదే సభలో చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలను సీఎం జగన్ కావాలనే పక్కకు పెట్టారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ ది అని అన్నారు. రాష్ట్రం ప్రస్తుత పరిస్థితిని అంతా ఆలోచించాలన్నారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. 25 ఏళ్ల వయసులోనే తనని రామారావు ఎమ్మెల్యే చేశారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పోవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలన్నారు. అయ్యన్న మాట్లాడుతున్నంత సేపు కూడా లోకేష్ నవ్వుతూనే కనిపించారు.