Chandra Babu : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే కేసీఆర్ విషయంలో ఆయన మాజీ కాదని చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. బీఆర్ఎస్ పార్టీనేతలు మాత్రమే కాదు బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా కూడా ఆయన మాజీ కాదని స్పష్టంచేస్తుంది.అయితే ఒకవైపు అధికారం కోల్పోయి బాధపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకి కేసీఆర్ రూపంలో పెద్ద షాక్ తగిలింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించి వైద్యులు కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
వైద్యుల పర్యవేక్షణలో వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో కేసీఆర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను పరామర్శించేందుకు రాజకీయ , సినీ ప్రముఖులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.ఏపీ మాజీ సీఎంతో పాటు తెలంగాణ డిప్యుటీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. మూడు రోజుల క్రితం హిప్ బోన్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ కూడా చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. తన ఆరోగ్య పరిస్థితిని కేసీఆర్ చంద్రబాబుకు వివరించారు. బీఆర్ఎస్ అధినేత త్వరగా కోలుకోవాలని చంద్రబాబు కాంక్షించారు. చంద్రబాబు యశోధ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కేసీఆర్ జరిగిన సర్జరీపై చంద్రబాబుకు వివరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాగా, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బీఆర్ఎస్ నాయకుడు చల్మడ లక్ష్మి నరసింహారావు యశోద ఆసుపత్రికి వచ్చి కేసీఆర్‌ను పరామర్శించారు.