Nymisha Reddy : తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలలో చాలా దూకుడుగా వ్యవహరించిన రేవంత్ ఇప్పుడు సీఎం అయ్యాక కూడా అంతే దూకుడుగా డెసిషన్స్ తీసుకుంటుంటున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే ‘ప్రజాదర్బార్’ వంటి కార్యక్రమాలతో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించారు. సీఎం అయ్యాక రేవంత్‌కి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఏబీవీపీ లీడర్ గా ఉస్మానియా వర్శిటీలో ఉద్యమాలు నిర్వహించేవారు. అలా ఇంటర్ చదివే రోజుల్లో ఆయన నాగార్జున సాగర్ వెళ్లినప్పుడు గీతారెడ్డిని తొలిసారి చూశారట.
అక్కడ మొదలైన పరిచయం స్నేహంగా మారి ఆ తరువాత ప్రేమగా మారిందట. మొదట రేవంత్ రెడ్డే ప్రపోజ్ చేయగా, ఆయన వ్యక్తిత్వం, ముక్కుసూటితనం నచ్చి గీతారెడ్డి కూడా ఓకే చెప్పేశారట. అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. మొదట్లో వీరి ప్రేమ విషయం తెలిసిన గీతారెడ్డి నాన్న వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదట. రేవంత్ లోని మొండితనం, ధైర్యం, చురుకుతనం గమనించి జైపాల్ రెడ్డి తనను ఒప్పించినట్లు గీతా రెడ్డి తండ్రి వెల్లడించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం తనకు కూడా నచ్చడంతో తన కుమార్తె గీతారెడ్డితో పెళ్లికి ఓకే చెప్పినట్లు వివరించారు. ఇలా రేవంత్ రెడ్డి, గీతారెడ్డి పెద్దల సహకారంతో, అందరి సమక్షంలో 1992లో వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఓ కుమార్తె నైమిష ఉన్నారు.
నైమిషకి సంబంధించి తాజాగా ఒక వీడియో విడుదల కాగా, అందులో తన తండ్రి గురించి అనేక విషయాలు చెప్పింది. డాడి మా మమ్మిని హోం మినిస్టర్ అని పిలుస్తారు. డాడి బయట రాజకీయాలు ఇతరత్రా వంటి విషయాలతో బిజీగా ఉంటుండగా, ఇంట్లో మా మమ్మి అన్ని చక్కపరుస్తుంది. మమ్మి సైడ్, డాడి సైడ్ వాళ్లని కూడా మమ్మి మేనేజ్ చేస్తుంది. మా ఇంటికి హోమ్ మినిస్టర్ మా మమ్మీనే. నాకు, డాడికి అప్పుడప్పుడు ఏదైన గొడవ అయిన కూడా మమ్మీనే ఏదో ఒకటి చెప్పి మాట్లాడేలా చేస్తుందని నైమిష పేర్కొంది.