CM YS Jagan : ఇటీవల ఏపీ రాజకీయం ఎంత వాడివేడిగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఛాన్స్ దొరికితే ఏదో ఒక విషయంపై ట్రోల్ చేస్తూ వార్తలలోకి ఎక్కేలా చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్‌పై దారుణమైన ట్రోలింగ్ నడుస్తుంది. తిరుపతి జిల్లా బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులను పరామర్శించి..వారికి నిత్యవసరాలు అందజేసేందుకు వెళ్లిన సమయంలో మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ జగన్ ఆలుగడ్డకు బదులుగా ఉల్లిగడ్డ అనడం ..దాన్ని సరిదిద్దుకునేందుకు పక్కనే ఉన్న వారిని అడిగినప్పటికి నెటిజన్లు మాత్రం ఉల్లిగడ్డ కు, ఆలుగడ్డ కు తేడా తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు మాత్రం మా జగన్ ఉల్లిగడ్డ అనలేదు. ఉర్లగడ్డ అన్నారు..ఉర్లగడ్డ అంటే రాయలసీమలో ఆలుగడ్డ అని అర్ధం అంటూ రిప్లై ఇస్తున్నారు. కౌంటర్ ఇస్తూ వీడియో లను కూడా పోస్ట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ వరద బాధితులకు ఇచ్చే నిత్యవసరాల సరుకుల పేర్లు చెప్పడంలో పొరపాటు పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొటాటో అంటే ఆలుగడ్డ అని కూడా తెలియని సీఎం అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే నెటిజన్లు మాత్రం సీఎం ఏ అన్నాడో చెవి పెట్టి వినండి అంటూ తెగ ఆడేసుకుంటున్నారు.
అసలు సభలో జగన్ ఏం మాట్లాడడంటే.. జగన్ మాట్లాడుతూ… తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8 వేలకు పైగా బాధితులను అక్కడకు తరలించామన్నారు. దాదాపు 60వేల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, కిలో ఆనియన్, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పొటాటోను ఉల్లిగడ్డ అనే అంటారు కదా? అని పక్కనున్న వారిని అడిగారు. పొటాటో అంటే ఆలుగడ్డ…. కానీ ఆయన ఉల్లిగడ్డ అంటారు కదా.. అని ప్రశ్నించారు. పక్కనున్న వారు బంగాళాదుంప అని చెప్పగా.. ఆ తర్వాత నవ్వుకుంటూ, ‘ఆ.. బంగాళాదుంప’ అన్నారు.