భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దిగ్గజ దర్శకులు ఉన్నారు. ఎంతో మంది అద్భుతమైన చిత్రాలను అందించారు. అలాంటి దర్శకుల్లో మణిరత్నం ఒకరు. క్లాసికల్ చిత్రాలను తీసే దర్శకుడిగా ఈయనకు ఎంతో పేరుంది. అనేకమైన క్లాసికల్ చిత్రాలను ఈయన తెరకెక్కించి ఎంతో పేరుగాంచారు. అలాగే ఈయన ఒక గొప్ప సంగీత దర్శకుడు కూడా. అయితే మణిరత్నం కెరీర్ గతంలో మాదిరిగా ఇప్పుడు లేదు. ఈయన ఫ్లాప్‌లను ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పుడప్పుడు సినిమాలను తీస్తున్నారు. కానీ అవేవీ ఆకట్టుకోవడం లేదు.
మణిరత్నం సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ బాగా తెలిసిన వ్యక్తి. సినిమా రంగంలో ఆయనకు ఎవరూ సాటి రారు అనే చెప్పవచ్చు. విజువల్ డైరెక్టర్ గా శంకర్, అలాగే రాజమౌళి కూడా సత్తా చాటుతున్నారు. కానీ గత 30 సంవత్సరాలుగా మణిరత్నం తనలో ఉన్న ప్రతిభను పూర్తిగా బయటకు తీయలేకపోయారనే వాదన వినిపిస్తోంది. ఇక తన 30 సంవత్సరాల కెరియర్లో జయాపజయాలను ఎదుర్కొన్న మణిరత్నం ఇప్పుడు మాత్రం ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నారు.
1980 లో తన సోదరుడు జీవీ కూడా ఒక క్రిటిక్ గా పని చేసేవారు. జీవీ చార్టెడ్ అకౌంటెంట్. అలాగే కమర్షియల్ అంశాల గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఇక సినిమా వ్యాపారంలో కూడా ఆయనలాగా ఎవరూ బిజినెస్ చేయలేరు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్ తీసుకురావడం, ప్రొడక్షన్స్ లాంటి ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేసేవారు. జీవీ, మణిరత్నం ఇద్దరూ కలిసి పనిచేసిన ఎన్నో సినిమాలు కూడా విజయవంతం అయ్యాయి. అనుకోకుండా ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం వల్ల మనస్తాపం చెందిన జీవీ ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా జీవీ ఆత్మహత్యతో మణిరత్నం కెరియర్ కూడా పతనం అయిందని చెప్పవచ్చు. రాజమౌళికి తను తీసిన సినిమాలు ఎక్కడ ఆడితే తనకు లాభం వస్తుందో అని ట్రిక్స్ బాగా తెలుసు. కానీ మణిరత్నం విషయంలో మాత్రం ఇది చాలా తక్కువనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు తీస్తాడు కానీ ప్రమోషన్స్ విషయంలో వెనుకంజలో ఉంటారు. అందుకే ఈ మధ్య మణిరత్నం సినిమాలు హిట్ కాలేకపోతున్నాయి. మరి ఇకపై అయినా ఆయన ఏమైనా హిట్స్ సాధిస్తారో.. లేదో.. చూడాలి.