Virat Kohli : రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో దుమ్ము రేపిన విషయం తెలిసిందే. టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ క్రికెటర్ తన టీంకి మాత్రం కప్‌ని అందించలేకపోయాడు. అయితే వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ సుధీర్ఘ విరామం తీసుకోబోతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. వన్డే వరల్డ్ కప్ ఓడినప్పటికీ వచ్చే ఏడాది పొట్టి ప్రపంచ కప్ లో ఆడి కచ్చితంగా కప్ తీసుకొస్తారని అందరు ఆశిస్తున్నారు. కాకపోతే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా? అని తెగ చర్చ జరుగుతోంది. వీళ్లిద్దరూ కూడా వన్డే వరల్డ్ కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. కోహ్లీ మొత్తం 11 మ్యాచుల్లో 765 పరుగులతో వరల్డ్ కప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 597 పరుగులతో రోహిత్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
వీళ్లిద్దరూ కూడా అద్భుతమైన సగటు, స్ట్రైక్ రేటుతో ఈ టోర్నీలో చెలరేగారు. కానీ గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్‌కు వీళ్లిద్దరూ దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఫార్మాట్‌లో వీళ్లిద్దరి భవితవ్యంపై చర్చ మొదలైంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. వీళ్లిద్దరి భవితవ్యంపై ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోలేమని పీటర్సన్ అన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగే టీ20కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహత్ శర్మ సౌతాఫ్రికా టూర్‌కి ఆడతారని అనుకున్నారు. కాని రోహిత్, విరాట్ విశ్రాంతి కోరడంతో వారిని వన్డే, టీ20లకి దూరంగా ఉంచి టెస్ట్ జట్టుకి ప్రకటించారు.
టెస్టులకు భారత జట్టు చూస్తే రోహిత్ శర్మ (సి), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మొహమ్మద్. షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. 3 టీ20ల కోసం భారత జట్టు చూస్తే యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్), రవీంద్ర జడేజా (వి.సి), వాషింగ్టన్ రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్ ఉన్నారు.
3 వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్. ఎంపికయ్యారు.