Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి యాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో టీడీపీ-జనసేన నేతలు పాల్గొన్నారు. . ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇవాళ లోకేష్.. యువగళం పాదయాత్ర 210వ రోజును పొదలాడలో కొనసాగించి, రాత్రికి అమలాపురం నియోజకవర్గంలో బస చేస్తారు. గతంలో పాదయాత్రలో లోకేష్ 2852.4 కి.మీ.నడిచారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో తిరిగి పాదయాత్రను మొదలుపెడుతున్నారు.
ఈ క్రమంలో వైసీపీపై నిప్పులు చెరగుతున్నారు లోకేష్.. చంద్రబాబు నాయుడిపై అవినీతి మరక వేశాడు సైకో జగన్. ఆయన అది జీవితంలో చేసిన పెద్ద తప్పు. అరెస్ట్ చేసిన తర్వాత అందరికి చంద్రబాబు గారి విజన్, విలువ ఏంటో అర్ధమైంది. ప్రజల కోసం ఆయన ఏం చేశాడో అర్ధమైంది. ఇక ప్యాలెస్ బ్రోకర్ సజ్జల ఒకడున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి..చంద్రబాబుపై మరకలు వేసే ప్రయత్నం చేశాడు. కాని చివరికి నిజమే గెలిచింది. చంద్రబాబు నిప్పుగా బయటకు వచ్చాడు. జగన్‌కి రాత్రి ఆత్మలతో మాట్లాడే జబ్బుంది. ఆ ఆత్మ చంద్రబాబు, పవన్ చేతులు కలపకూడదని ఎన్నో అనుకున్నారు. కాని అది జరగకుండా చేశారు పవన్ అన్న అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
నారా లోకేష్ యువగళం పాదయత్ర టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సహాన్ని కలిగించింది. యువత, ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. ప్రజల సమస్యలను అడుగుతూ ముందుకు సాగిపోతున్న సమయంలోనే చంద్రబాబు అరెస్ట్‌తో బ్రేక్ పడింది. ఈసారి మరింత ఉత్సాహంగా యువగళం పాదయాత్రలో పాల్గోబోతున్నారు లోకేష్. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వారాహియాత్రను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత ఆయన యాత్ర ఉండవచ్చని తెలిసింది.