Hyderabad Couple : ఇటీవల కాలంలో యూత్ హద్దులు దాటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు సోషల్‌మీడియాలో పాపులర్ అయ్యేందుకు పిచ్చిపనులు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వీడియోలు చేసి నెట్టంట పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఉత్తరాదిన ఎక్కువగా మనకు దర్శనమిచ్చాయి. అయితే వీటిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి హైదరాబాద్ నగరానికీ కూడా పాకింది. ఓ ప్రేమ జంట కారుపైకి చేరి బహిరంగంగా రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయి ముద్దులతో మజా పొందే ప్రయత్నం చేయగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
నాలుగు గోడల మధ్య రొమాన్స్ చేసుకోవడం మానేసి ఇప్పుడు పబ్లిక్‌గా హద్దులు దాటి ఇలా కిస్ లు ఇచ్చుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై రయ్యిమంటూ దూసుకుపోతున్న కారుపై ఉండే సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన ఎ జంట లిప్ కిస్ లతో రెచ్చిపోయారు. వారి వాలకం చూస్తుంటే మద్యం ప్రభావానికి లోనైనట్టుగా కనిపిస్తోంది. ఈ తతంగాన్ని వెనుక కారులో వస్తున్న వారు ఫోన్ లో చిత్రీకరించడంతో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు కలిగించిన ఈ అసౌకర్యానికి, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, ప్రజల భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు హైదరాబాద్ పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఓ యూజర్ పేర్కొన్నారు. ఆ మధ్య బైక్ పై రయ్ మంటూ దూసుకుపోతూ ముద్దాడుతున్న ప్రేమికుల చేష్టలు కొన్ని వెలుగు చూశాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఇలాంటి సంఘటన వెలుగు చూడడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Hope @hydcitypolice will take action on this unsafe driving mode & Inconvenience caused to public.. #PVNRExpressway pic.twitter.com/K2QgqgpStp
— Dharani (@DharaniBRS) October 15, 2023