Perni Nani : గత కొద్ది రోజులుగా బాలయ్యపై వైసీపీ నాయకులు తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రోజా, అంబటి రాంబాబు వంటి వారు ఇప్పటికే బాలయ్యపై విమర్శలు కురిపించగా, ఇప్పుడు పేర్ని నాని వారి జాబితాలో చేరారు.చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లగానే ఆయన సీట్లో బాలకృష్ణ కూర్చోవడం దేనికి సంకేతమని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు స్వల్పకాలిక చర్చ జరిగింది.ఈ చర్చలో ఇవాళ ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ పేర్ని నాని బాలకృష్ణపై సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీకి రాకపోతే ఆయన సీట్లో ఎవరూ కూర్చోరన్నారు.
సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయన సీట్లో ఎవరూ కూర్చోరని పేర్ని నాని స్పష్టం చేశారు.. ఏపీ అసెంబ్లీలో ఇవాళ చంద్రబాబు కుర్చీలో నిలబడి బాలకృష్ణ విజిల్ ఊదడాన్ని పేర్ని నాని ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ ద్వారా రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా బాలకృష్ణ చెబుతున్నారన్నారు. ఎవరో రాసిచ్చిందో చదవడం కంటే వాస్తవాలు తెలుసుకోవాలని పేర్ని నాని బాలకృష్ణకు సూచించారు. ఒప్పందంపై చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఇప్పుడు ప్రశ్నిస్తే.. కాదు లేదు అని సమాధానాలు చెబుతున్నారని పేర్కొన్నారు.
ఈడీ, జీఎస్టీ ద్వారా పాత్రదారులు జైలుకు వెళ్లారని… ఇప్పుడు సూత్రధారి వెళ్లారన్నారు. అవినీతి సొమ్ము చంద్రబాబు పీఏ, కిలారి రాజేష్‌ల ద్వారా అందాయన్నారు. ఈ ఇన్విస్టిగేషన్‌ను కొనసాగించాలని… ఒత్తిడులకు లొంగకుండా ముందుకు వెళ్లాలని పేర్నినాని కోరారు. సిమెన్స్‌తో ఒప్పందం జరిగితే డిజైన్ టెక్‌కు ఎందుకు పంపిందని ప్రశ్నించారు. అక్కడి నుండి డొల్ల కంపెనీలకు ఆ డబ్బు వెళ్లిపోయిందన్నారు. ఆ డబ్బును యోగేష్ గుప్తా అనే మనీ డీలర్ హవాలా ద్వారా చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, కిలారి రాజేష్‌లకు అందించారని చెప్పారు. చంద్రబాబు అరెస్టు అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఆదరాబాదరాగా వచ్చారన్న పేర్ని నాని… ముఖ్యమంత్రి అనే వ్యక్తి సంతకాలు పెట్టరు అని అంటున్న పవన్‌కు చెపుతున్నా.. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని తెలిపారు.