Pawan Kalyan : ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా అల్లు అర్జున్ గురించి చర్చ నడుస్తుంది. పుష్ప సినిమాతో బన్నీకి నేషనల్ అవార్డ్ దక్కడం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 69 ఏళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి ఒక్క నటుడికి కూడా నేషనల్ అవార్డ్ రాలేదు. కాని బన్నీ దానిని సాకారం చేశాడు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి వారితో కూడా సాధ్యం కానిది.. అల్లు అర్జున్ సాధించి చూపించాడు. అలాంటప్పుడు అందరూ గర్వించాలి. కానీ ఇప్పుడు కూడా బన్నీని కొందరు ట్రోల్స్ చేయడం మహా దారుణంగా ఉంది. జై భీమ్ సినిమాతో పోలుస్తూ పుష్ప సినిమాను ఏకి పారేస్తున్నారు. జై భీమ్ లాంటి మంచి సందేశాత్మక సినిమాకు రాకుండా.. స్మగ్లింగ్ ఎలా చేయాలో చూపించిన పుష్ప సినిమాకు రావడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు.
కాని బన్నీ నటనకి మాత్రం ఆ అవార్డ్ ఇవ్వాల్సిందే అని మరి కొందరు చెప్పుకొస్తున్నారు. అది అలా ఉంటే బన్నీ గురించి పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో చాలా గొప్పగా మాట్లాడారు. హ్యాపీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కిగెస్ట్‌గా హాజరైన పవన్ కళ్యాణ్.. తాను చిరంజీవికి, అల్లు అరవింద్‌కి రుణపడి ఉంటానని అన్నారు. తన రెండు సినిమాలని ఆయనే రిలీజ్ చేసారని సంతోషం వ్యక్తం చేశారు. అయితే అరవింద్ కొడుకు అల్లు అర్జున్‌కి మంచి భవిష్యత్ ఉందని, మంచి స్థాయిలో ఉంటాడని పవన్ అన్నారు.ఆయన ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు బన్నీ నేషనల్ అవార్డ్ అందుకొని ఉన్నత స్థానంలో నిలిచారు.
గతంలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పను అన్నందుకు బన్నీని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. డీజే మూవీపై నెగిటివిటీ ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా పోస్ట్స్ పెడుతుంటారు. కాని అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ మెగా ఫ్యామిలీ హీరోగానే ఉంటానని అంటున్నాడు.కట్టె కాలేవరకు తాను చిరంజీవి అభిమానే అని ఇటీవల ఓ సందర్భంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు బన్నీ .ఇప్పుడు ఆయన నటించిన పుష్ప 2 విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంతో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.