Devineni Avinash : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో భవిష్యత్‌కి గ్యారెంటీ చైతన్య రధయాత్ర సభ జరగగా, ఆ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. జగన్ సైకో నా కొడుకు. ఆరు నెలల్లో సమాధి కావడం ఖాయం’ అంటూ జగన్‌పై ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు గుప్పించారు. మోదీకి కొడుకు పుడితే జగన్ ముద్దు పెట్టుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ చిన్న దొంగ కాదని, చాలా పెద్ద దొంగ అని అన్నారు. జగన్ అర్థిక ఉగ్రవాదని, ధన పిశాచని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాదయాత్ర చేస్తే మగాళ్లు కాదు. ఆడాళ్లే కొడతారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. 18 సార్లు జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం చేశాడు. మోదీ గదిలోకి వెళ్లి జగన్ ఏం చేస్తున్నాడు? ప్రత్యేక హోదా అడుగుతున్నాడా? లేక పిసికేస్తున్నాడా?’’ అంటూ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. పోలవరంలో మాజీ మంత్రి అనిల్ నీళ్లు పారిస్తాన్నన్నారని, కానీ ప్రస్తుతం నీళ్లు లేవని, ఆయన కూడా లేరని అన్నారు. ఇక మంత్రి అంబటిని పోలవరం సంగతి చెప్పమంటే అరగంట చాలంటాడని, అరగంటలో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక ‘‘రింగుల రాణి రోజా. టూరిజం సంగతి ఏంటమ్మా అంటే నా సొగసు చూడు మాయ్యా అంటుంది.’’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు.
అయ్యన్న పాత్రుడు ఓ ముఖ్యమంత్రిని అలానే రోజాని విమర్శించడంపై దేవినేని అవినాష్ మండిపడ్డారు. తెలుగు దేశం వాళ్లు చాలా దిగజారారు. ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు, వీడు అని ఓ బఫూన్ మాట్లాడతాడా, కనీసం ఎమ్మెల్యేలుగా గెలవలేని వాళ్లు టీడీపీలో ఉండగా, వారు జగన్‌ని తిడతారా. అసలు మహిళా మంత్రిని వారు ఎలా తిడతారు, మరి అంత దిగిజారిపోయారు. చిల్లర వ్యాఖ్యలు , దిగజారుడు వ్యాఖ్యలు ఒక్క తెలుగుదేశం నాయకులు మాత్రమే చేయగలరు అని దేవినేని అవినాష్ వారిపై విమర్శల వర్షం గుప్పించారు. లోకేష్ నిన్ను చూసి ఎవడు ఉచ్చ కూడి పోసుకోని పరిస్థితి. మాట జాగ్రత్త అంటూ విమర్శలు గుప్పించారు అవినాష్.