KA Paul : జనసేనాని పవన్ కళ్యాణ్‌పై పలు పార్టీల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండగా, అతనిపై మిగతా పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేఏ పాల్ .. పవన్ పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ బడుగు బలహీనవర్గాల కోసం పార్టీ పెట్టాను అన్నాడు.. కానీ మళ్ళీ అగ్ర కులాల కోసం పని చేస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన సలహాలు తీసుకుంటున్నాడు కానీ పూర్తి స్థాయి లో అమలు చేయటం లేదని తెలిపారు పాల్. పవన్ కళ్యాణ్.. ఆయనే సీఎం అని అంటున్నాడు.. టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.
గతంలో కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పవన్ ఇప్పుడు పొత్తులు వద్దని బయటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పొత్తులు ఎందుకని పవన్ ను ప్రశ్నించారు. పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడని తెలిపారు. “నేనే సనాతన ధర్మం, చేగువేరా, నక్సలైట్, ఆర్ఎస్ఎస్ ఇలా పూటకో ధర్మం అంటున్నాడు.. అసలు నువ్వు ఏ ధర్మంను పాటిస్తున్నావు” నాకు చెప్పు అని కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ స్టార్ అని ఎద్దేవా చేశారు.
“వంగవీటి రంగాను చంపిన వారితో నీకు పొత్తులు ఎందుకు” అని ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఒక్కసారి తప్పు చేస్తే.. పవన్ కళ్యాణ్ రోజూ తప్పు చేస్తున్నాడని విమర్శించారు. నా రియల్ హీరో మీరే అని నన్ను అన్న పవన్ కళ్యాణ్.. నా బాటలో ఎందుకు నడవడం లేదు” అని ప్రశ్నించారు. ఆయనకు తిప్పి కొడితే పది లక్షల మంది అభిమానులు కూడా లేరని కేఏ పాల్ కామెంట్స్ చేశారు. ప్రజలను మోసం చేస్తూ పవన్ ఏడాదికి 10 పార్టీలు మారాడని ఆరోపించారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఏపీలో ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే.. తాను కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని పాల్ పేర్కొన్నారు.